జగన్ వ్యాఖ్యలను తలుచుకుని మథనపడుతున్న గొట్టిపాటి వర్గం
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరిస్థితి తలకిందులైందన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పుడు కరణం బలరాంతో పాటు ఇతర టీడీపీ సీనియర్ నేతల నుంచి అవమానాలు కామనైపోయాయి. శనివారం మినీ మహానాడులో ఎదురైన చేధు అనుభవం తర్వాత గొట్టిపాటితో పాటు ఆయన ముఖ్య అనుచరులు మరింత ఎక్కువగా మథనపడుతున్నారు. మినీ మహానాడులో కరణం బలరాం వర్గీయులు ఏకంగా గొట్టిపాటి వర్గంపై దాడి చేసి తరిమికొట్టినంత పని చేశారు. అంత జరుగుతున్నా కనీసం ప్రతిఘటించలేని పరిస్థితి […]
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరిస్థితి తలకిందులైందన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పుడు కరణం బలరాంతో పాటు ఇతర టీడీపీ సీనియర్ నేతల నుంచి అవమానాలు కామనైపోయాయి. శనివారం మినీ మహానాడులో ఎదురైన చేధు అనుభవం తర్వాత గొట్టిపాటితో పాటు ఆయన ముఖ్య అనుచరులు మరింత ఎక్కువగా మథనపడుతున్నారు. మినీ మహానాడులో కరణం బలరాం వర్గీయులు ఏకంగా గొట్టిపాటి వర్గంపై దాడి చేసి తరిమికొట్టినంత పని చేశారు. అంత జరుగుతున్నా కనీసం ప్రతిఘటించలేని పరిస్థితి గొట్టిపాటిది. పైగా మినీ మహానాడులోనే కరణం బలరాం ఏ ప్యాకేజ్‌కు లొంగి టీడీపీలోకి వచ్చారంటూ గొట్టిపాటిపై విరుచుకుపడ్డారు. పార్టీలోకి వచ్చి పిచ్చివేషాలు వేస్తే సహించమని హెచ్చరించారు. ఇంతకాలం కరణం కుటుంబంతో పోరాడిన గొట్టిపాటి వారికి ఆ మాటలు విన్న తర్వాత ప్రాణం పోయినంత పనైందని చెబుతున్నారు.
ఈ పరిస్థితి చూసిన తర్వాత గొట్టిపాటి ఆయన ముఖ్యఅనుచరులు వాపోతున్నారు. సొంతింటిలాంటి వైసీపీని వీడి తప్పు చేశామన్న భావనను ఒకరివద్ద మరొకరు వ్యక్తపరుచుకుంటున్నారు. ఒకసారి గొట్టిపాటి హనుమంతరావు విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన జగన్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. ”గొట్టిపాటి రవి నా సోదరుడు” అంటూ బహిరంగసభలోనే అప్పట్లో జగన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటలను తలుచుకుని గొట్టిపాటి అనుచరులు మథనపడుతున్నారు. జగన్ గొట్టిపాటిని ఒక సోదరుడిలా చూసుకున్నారని తమ నేతే ఆవేశపడ్డారని వాపోతున్నారు. వ్యాపారాల పరంగా అధికార పార్టీ ఇబ్బందులు కలిగించి తమ నేతను లొంగదీసుకుందని… కానీ ఇప్పుడు పార్టీలో ఎదురవుతున్నఅవమానాలను చూశాక ఎన్నికోట్లు ఉన్నా ఇలాంటి బతుకు బతికి ఏం లాభం అని రవికుమార్ అనుచరులు వాపోతున్నారు. ఇక ముందు తమ పరిస్థితి ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదంటున్నారు.
Click on Image to Read: