పొన్నం కోపానికి కారణం అదేనా?
గత కొంతకలంగా మీడియాకు దూరంగా ఉన్న కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు కోపం వచ్చింది. అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చాడు. వస్తూనే ఏకంగా సీఎం కేసీఆర్ మీద విరుచుకుపడ్డాడు. టీచర్ల పోస్టుల భర్తీపై తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఇంతకీ పొన్నం కోపానికి కారణం ఏంటంటే.. టీచర్ల నియామకాలను డిస్ట్రిక్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల నుంచి తప్పించి, టీఎస్ పీఎస్‌సీకి అప్పగిస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న […]
BY admin21 May 2016 5:42 AM IST
X
admin Updated On: 21 May 2016 8:20 AM IST
గత కొంతకలంగా మీడియాకు దూరంగా ఉన్న కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు కోపం వచ్చింది. అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చాడు. వస్తూనే ఏకంగా సీఎం కేసీఆర్ మీద విరుచుకుపడ్డాడు. టీచర్ల పోస్టుల భర్తీపై తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఇంతకీ పొన్నం కోపానికి కారణం ఏంటంటే.. టీచర్ల నియామకాలను డిస్ట్రిక్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల నుంచి తప్పించి, టీఎస్ పీఎస్‌సీకి అప్పగిస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే టీచర్ అర్హత పరీక్ష (టెట్) కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో సైతం ఈవిషయంపై పలు సందేహాలు, ఆందోళనలు నెలకొన్నాయి. రెండేళ్ల నుంచి డీఎస్సీ వేస్తామంటూ నిరుద్యోగులను ఊరిస్తూ వచ్చి ఇప్పుడు మాట మార్చడంపై పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి, వేలాది రూపాయలు వెచ్చించి డీఎస్సీకి సన్నద్దమవుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం కేసీఆర్ తీసుకున్న తుగ్లక్ చర్యేనని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఈ దఫా టీచర్ల నియామకాల్ని డీఎస్సీలకు వదిలేసి, మరుసటి డీఎస్సీని టీఎస్ పీఎస్‌సీకి అప్పగించుకోవాలని హితవు పలికారు.
ఆయనొక్కడే ఎందుకు స్పందించాడు..
2014 ఎన్నికల అనంతరం కరీంనగర్ డీసీసీలో ఆధిపత్య పోరు నెలకొంది. ఎవరి మాటా ఎవరూ వినడం లేదు. రెడ్లు, బీసీలు, ఓసీలంటూ ఎవరికివారు విడిపోయారు.ఇటీవల నియమించిన సమన్వయ కమిటీపైనా నేతలు విభేదించారు. దీంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. డీసీసీలు, మండల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలను ప్రక్షాళన చేయాలని ఇటీవల కాంగ్రెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్‌లో తిరిగి తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకే పొన్నం తిరిగి మీడియాలోకి వచ్చాడని పలువురు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో సీఎం కిరణ్ కరీంనగర్ పర్యటనకు వస్తే.. ఆయన హెలికాప్టర్‌ను గాలిలోనే పేల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశాడు పొన్నం. దీనిపై ఏపీలో పలు చోట్ల ఆయనపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు సైతం అందాయి. ఆ తరువాత ఆయనెప్పుడూ పెద్దగా మీడియాలో కనిపించింది లేదు. తాజాగా వ్యాఖ్యలతో పొన్నం తిరిగి యాక్టివ్ అయ్యారని ఆయన అనుచరులు అంటున్నారు.
Next Story