సీట్లో కూడా కూర్చోవద్దని అవమానించారు...
వైసీసీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రుకు టీడీపీలో ఏమో గానీ మీడియాలో మాత్రం మంచి అవకాశాలే వస్తున్నాయి. టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి నెహ్రును కొన్ని టీవీచానళ్లు పోటీ పడి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. తాజాగా టీడీపీ టీవీ చానల్ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. అందులో జగన్ గురించి నెహ్రు కొన్ని సున్నితమైన ఆరోపణలు చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా జగన్ పక్కనే ఉన్న సీట్లో కూర్చునే అవకాశాన్ని కూడా తనకు ఇవ్వలేదన్నారు. నా పక్కన ఉన్న […]
వైసీసీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రుకు టీడీపీలో ఏమో గానీ మీడియాలో మాత్రం మంచి అవకాశాలే వస్తున్నాయి. టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి నెహ్రును కొన్ని టీవీచానళ్లు పోటీ పడి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. తాజాగా టీడీపీ టీవీ చానల్ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. అందులో జగన్ గురించి నెహ్రు కొన్ని సున్నితమైన ఆరోపణలు చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా జగన్ పక్కనే ఉన్న సీట్లో కూర్చునే అవకాశాన్ని కూడా తనకు ఇవ్వలేదన్నారు. నా పక్కన ఉన్న సీట్లో కూర్చోవద్దు అన్నా వెళ్లి మరొక చోట కూర్చో అని జగనే ఒకసారి నేరుగా చెప్పారని ఆరోపించారు. వైసీపీలో సమిష్టి నాయకత్వం లేదని ఉన్నదంతా ఏక నాయకత్వమేనన్నారు. మంత్రి పదవి తాను అడగలేదని… చంద్రబాబే ఇస్తానని హామీ ఇచ్చినట్టు నెహ్రు చెప్పారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప త్యాగం చేయాల్సిన అవసరం లేకుండానే తనకు మంత్రి పదవి దక్కాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
తాము పార్టీ ఫిరాయించామంటే అందులో తమ తప్పేమీ లేదన్నారు. అందుకు నాయకత్వమే బాధ్యత వహించాలన్నారు. తన కులానికి చెందిన చిరంజీవి సీఎం అవుతారన్న ఉద్దేశంతోనే ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లినట్టు నెహ్రు చెప్పారు. యనమల రామకృష్ణుడితో తనకెలాంటి విబేధాలు లేవని చెప్పారు.
Click on Image to Read: