తన్నుకున్న బలరాం, గొట్టిపాటి వర్గీయులు... పోలీస్ లాఠీచార్జ్
ప్రకాశం జిల్లా టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొద్దికాలంగా అద్దంకి టీడీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, టీడీపీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు కొట్టుకున్నారు. ఒంగోలులో జరిగిన టీడీపీ మినీమహానాడు ఇందుకు వేదికైంది. సమావేశంలో బలరాం వర్గీయులు జై బలరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు కూడా జై గొట్టిపాటి అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ […]
ప్రకాశం జిల్లా టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొద్దికాలంగా అద్దంకి టీడీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, టీడీపీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు కొట్టుకున్నారు. ఒంగోలులో జరిగిన టీడీపీ మినీమహానాడు ఇందుకు వేదికైంది. సమావేశంలో బలరాం వర్గీయులు జై బలరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు కూడా జై గొట్టిపాటి అంటూ నినాదాలు చేశారు.
దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయారు. గొట్టిపాటి వర్గీయులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కాళ్లతో తన్నుకున్నారు.చొక్కాలు చించుకున్నారు. గొట్టిపాటి వర్గీయులను సమావేశం నుంచి బయటకు తరిమే ప్రయత్నం చేశారు. ఘర్షణ జరుగుతున్న సమయంలోనే కరణం బలరాం వేదికపైకి వచ్చారు. మంత్రి రావెల కిషోర్ బాబు సమక్షంలోనే ఈ ఘర్షణ జరిగింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి… ఇరు వర్గాలపై లాఠీచార్జ్ చేశారు. సమావేశానికి వచ్చిన మేజారిటీ టీడీపీ కార్యకర్తలు కరణం బలరాం వర్గానికే సపోర్టు చేశారు.
కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య చాలా కాలంగా వైరం ఉంది. అయితే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ కొద్దిరోజుల క్రితమే టీడీపీలో చేరారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. పలుమార్లు గొట్టిపాటిపై కరణం బలరాం నేరుగానే తీవ్ర ఆరోపణలు చేశారు. దోచుకున్నది దాచుకునేందుకు గొట్టిపాటి టీడీపీలోకి వచ్చారని విమర్శించారు.
Click on Image to Read: