మహేష్, మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలైంది..!
ఏదైనా అతి అయితే ప్రమాదమే. కొందిరి అభిమానం మితిమీరడం కూడా ఇటువంటిదే. తమ అభిమాన హీరో చిత్రం బావుండాలనుకోవడం తప్పు లేదు. మా హీరో సినిమా మాత్రమే బావుండాలనేకునే వారితో సమస్య. తమ హీరో కాకుండా.. ఇతర హీరోల చిత్రాలు రిలీజ్ సమయంలో సోషల్ నెట్ వర్క్ ను వేదిక చేసుకుని దారుణంగా నెగిటివ్ ప్రచారం చేస్తుండటం సర్వ సాధారణం అయ్యింది. అభిమానం అనేది మితి మీరి అది కులాల పోరుగా రూపాంతరం […]
BY sarvi20 May 2016 5:39 AM IST
X
sarvi Updated On: 21 May 2016 7:40 AM IST
ఏదైనా అతి అయితే ప్రమాదమే. కొందిరి అభిమానం మితిమీరడం కూడా ఇటువంటిదే. తమ అభిమాన హీరో చిత్రం బావుండాలనుకోవడం తప్పు లేదు. మా హీరో సినిమా మాత్రమే బావుండాలనేకునే వారితో సమస్య. తమ హీరో కాకుండా.. ఇతర హీరోల చిత్రాలు రిలీజ్ సమయంలో సోషల్ నెట్ వర్క్ ను వేదిక చేసుకుని దారుణంగా నెగిటివ్ ప్రచారం చేస్తుండటం సర్వ సాధారణం అయ్యింది. అభిమానం అనేది మితి మీరి అది కులాల పోరుగా రూపాంతరం చెందింది. తమ కులపు హీరో చిత్రాలే సూపర్ అన్నట్లుగా కొందరు వెర్రి అభిమానులు ప్రవర్తిస్తుండటం బాధాకరం. కోట్లు పెట్టి సినిమా చేస్తాడు నిర్మాత. రిలీజ్ కు ముందు నుంచే వెర్రి అభిమానులు.. యాంటి గ్యాంగ్స్ చేస్తున్న నెగిటివ్ ప్రాచారం వల్ల అంతిమంగా సినిమా పై కొంత మైనస్ అయ్యే.. అవకాశం ఉంది.
ఈ రోజు రిలీజ్ అయిన మహేష్ బ్రహ్మోత్సవం చిత్రం పై అప్పుడే మహేష్ అంటే గిట్టని కొందరు యాంటి గ్యాంగ్స్ సోషల్ నెట్ వర్క్ లో బ్రహ్మోత్సవం పై నెగిటివ్ పబ్లిసిటి ప్రారంభించారు. అమెరికా లో వున్న కొందరు.. సినిమా చూశాం .. మహేష్ గతంలో చేసిన ఆగడు చిత్రం కంటే దారుణంగా ఉందంటూ ట్విట్స్ చేస్తున్నారు. ఇది చాలా దారుణం అంటున్నారు మహేష్ అభిమానులు.
అయితే ప్రస్తుతం బెనిఫిట్ షోలు చూస్తున్న సోషల్ నెట్ వర్క్ సమీక్షకులు చిత్రం గురించి బ్రీఫ్ గా రివ్యూస్ తమ వైబ్ సైట్లకు పంపుతున్నారు. అందరు కామన్ గా ఇప్పటి వరకు అంటే సినిమా ఫస్ట్ ఆఫ్ వరకు ( కంప్లీట్ అయ్యింది..) బ్రహ్మోత్సవం లాగానే ఉందంటూ రాయడం విశేషం. ఇంధ్ర ధనసు..హరివిల్లు లాంటి సినిమా .. ఆడియన్స్ ను అలరించక పోవడం అసాధ్యం అంటున్నారు పరీశీలకులు. నిజమే కదా.!
Next Story