మూల కారణం రెండు రోజుల్లో చెబుతా...
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమవుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు తీరు వల్ల కృష్ణా, గోదావరి బేసిన్‌లు ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. రాయలసీమ రాళ్ల సీమగా మారే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులు అడ్డుకోవాల్సిందిగా తాము డిమాండ్ చేస్తుంటే… కాంట్రాక్టర్లు వైసీపీ నేతలంటూ విమర్శలు చేయడం దారుణమన్నారు. అసలు ప్రాజెక్టుల నిర్మాణానికి టెండర్లు పిలుస్తుంటే ఏడాదిగా ఏపీ ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని […]
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమవుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు తీరు వల్ల కృష్ణా, గోదావరి బేసిన్‌లు ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. రాయలసీమ రాళ్ల సీమగా మారే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులు అడ్డుకోవాల్సిందిగా తాము డిమాండ్ చేస్తుంటే… కాంట్రాక్టర్లు వైసీపీ నేతలంటూ విమర్శలు చేయడం దారుణమన్నారు. అసలు ప్రాజెక్టుల నిర్మాణానికి టెండర్లు పిలుస్తుంటే ఏడాదిగా ఏపీ ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమ తలబిడుసుతనంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. కొన్ని పత్రికలు చంద్రబాబు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని రాస్తున్నాయని.. ఆ పత్రికలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కాదా అని ప్రశ్నించారు.
అసలు చంద్రబాబు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో మూల కారణాన్ని రెండు రోజుల్లో బయటపెడుతానని బొత్స చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణలోని అధికార పార్టీతో ఏపీ టీడీపీ నేతలు లాలూచీ పడి ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వాటన్నింటిని బయటకు చెబుతానన్నారు. రాజ్యసభ సీటు వైసీపీకి దక్కి తీరుతుందన్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విజయసాయిరెడ్డే సరైన వ్యక్తి అన్నది తన వ్యక్తిగత భావన కూడా అని అన్నారు.
మరో పది మంది ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకున్నా వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఇప్పటికే తీసుకెళ్లిన 17 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఏం చేయగలుగుతున్నారని ప్రశ్నించారు. అన్ని పథకాలకు చంద్రన్న అని పేరు పెట్టుకోవడం హెరిటేజ్ మజ్జిగ పథకం, హెరిటేజ్ పెరుగు పథకం, హెరిటేజ్ నెయ్యి పథకం అంటూ చంద్రబాబు చేస్తున్న పనులు ఎబ్బేట్టుగా ఏవగింపుగా ఉన్నాయని బొత్స విమర్శించారు. అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణకు కర్నాటక ప్రభుత్వం సిఫార్సు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని బొత్స ఆరోపించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో మంత్రులు కుమ్మక్కయ్యారని విమర్శించారు.
Click on Image to Read: