దీదీ... ది బెంగాల్ టైగర్
పశ్చిమబెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ అఖండవిజయం సాధించింది. బెంగాల్ వార్ వన్ సైడ్‌గా సాగింది. ఏ దశలోనూ దీదీ దరిదాపులకు కూడా విపక్షాలు రాలేకపోయాయి. కమ్యూనిస్టులకు మరోసారి ఘోర పరాభవాన్ని బెంగాల్ జనం అందించారు. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ ఏకంగా 212 స్థానాల్లో తిష్టవేసింది. కమ్యూనిస్టుల కూటమి కేవలం 71 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక్కడ కమ్యూనిస్టులకు మరో దిగ్భ్రాంతికర అంశం ఏమిటంటే… కమ్యూనిస్టుల కంటే కాంగ్రెసే ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. కమ్యూనిస్టులకు 28 స్థానాలు రాగా… కాంగ్రెస్ […]
పశ్చిమబెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ అఖండవిజయం సాధించింది. బెంగాల్ వార్ వన్ సైడ్‌గా సాగింది. ఏ దశలోనూ దీదీ దరిదాపులకు కూడా విపక్షాలు రాలేకపోయాయి. కమ్యూనిస్టులకు మరోసారి ఘోర పరాభవాన్ని బెంగాల్ జనం అందించారు. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ ఏకంగా 212 స్థానాల్లో తిష్టవేసింది. కమ్యూనిస్టుల కూటమి కేవలం 71 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక్కడ కమ్యూనిస్టులకు మరో దిగ్భ్రాంతికర అంశం ఏమిటంటే… కమ్యూనిస్టుల కంటే కాంగ్రెసే ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. కమ్యూనిస్టులకు 28 స్థానాలు రాగా… కాంగ్రెస్ 41 స్థానాల్లో తిష్టవేసింది. బీజేపీ పది స్థానాల్లో విజయం సాధించింది. శారదా చిట్ ఫండ్ కుంభకోణం టీఎంసీని దెబ్బతీస్తుందని బావించినా దీదీ చరిష్మా ముందు అవేవి నిలబడలేదు. ఫలితాలతో తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఫలితాలతో కమ్యూనిస్టులు ఖంగుతిన్నారు. మొత్తం మీద మమతా బెనర్టీ .. దీదీ ది బెంగాల్ టైగర్ అనిపించుకున్నారు.
Click on Image to Read: