జయహో... చరిత్ర సృష్టించిన అమ్మ
తమిళనాడులో జయలలిత చరిత్ర సృష్టించింది. సాంప్రదాయానికి చరమగీతం పాడుతూ రెండోసారి అధికార పీఠం కైవసం చేసుకుంది. పూర్తి స్థాయి ఫలితాలు రావాల్సి ఉన్నప్పటికీ జయ పార్టీ అన్నా డీఎంకే మేజిక్ ఫిగర్ దాటేసింది. 234 స్థానాలున్న తమిళనాడులో జయ పార్టీ 141 స్థానాల్లో తిష్టవేసింది. కరుణ పార్టీ 86 స్థానాల వద్ద ఉంది. కింగ్ మేకర్లం అవుతామని కలలు కన్న విజయ్‌కాంత్ పార్టీ గల్లంతైంది. ఒక్కచోట కూడా ఆ పార్టీ వాసన లేదు. అధికారంలోకి రావడమే టార్గెట్‌గా కరుణనిధి భారీగా […]
తమిళనాడులో జయలలిత చరిత్ర సృష్టించింది. సాంప్రదాయానికి చరమగీతం పాడుతూ రెండోసారి అధికార పీఠం కైవసం చేసుకుంది. పూర్తి స్థాయి ఫలితాలు రావాల్సి ఉన్నప్పటికీ జయ పార్టీ అన్నా డీఎంకే మేజిక్ ఫిగర్ దాటేసింది. 234 స్థానాలున్న తమిళనాడులో జయ పార్టీ 141 స్థానాల్లో తిష్టవేసింది. కరుణ పార్టీ 86 స్థానాల వద్ద ఉంది. కింగ్ మేకర్లం అవుతామని కలలు కన్న విజయ్‌కాంత్ పార్టీ గల్లంతైంది. ఒక్కచోట కూడా ఆ పార్టీ వాసన లేదు. అధికారంలోకి రావడమే టార్గెట్‌గా కరుణనిధి భారీగా ఎన్నికల హామీలు ఇచ్చినా అమ్మ వైపే తమిళతంబీలు నిలబడ్డారు. సీలం జిల్లాలో డీఏంకే ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.
ఒక సారి ఒక పార్టీ గెలిస్తే మరోసారి మరో పార్టీ అధికారంలోకి రావడం తమిళనాడులో సాంప్రదాయంగా ఉంది. కానీ ఈసారి ఆ సాంప్రదాయాన్ని అమ్మ తిరగరాశారు. 30 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా అన్నా డీఎంకే నిలిచింది. అప్పట్లో ఎంజీఆర్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. చెన్నై వరదల ప్రభావం మాత్రం జయపార్టీపై స్పష్టంగా కనిపించింది. చెన్నై పరిధిలో మొత్తం 16 స్థానాలుండగా 11 స్థానాల్లో కరుణానిధి పార్టీ కైవసం చేసుకుంది.
ప్రభుత్వ వ్యతిరేకతను కరుణ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయారు. కౌంటింగ్ మొదలవగానే రెండు పార్టీల మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. అయితే చివరకు అమ్మ పార్టీ మేజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో జయ ఇంటి వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. తొలుత ఎగ్జిట్ పోల్స్ కరుణనిధిదే తమిళపీఠం అని చెప్పాయి. అయితే స్థానిక మీడియా సంస్థలు మాత్రం జయ విజయకేతనం ఎగురవేస్తారని చెప్పారు. చివరకు స్థానిక మీడియా సంస్థల సర్వేలే నిజమయ్యాయి.
Click on Image to Read: