బాబు "బ్రీఫ్డ్ మీ" పై మోదీ ట్వీట్
మంగళవారం జరిగిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మీడియాలో ఓ రేంజ్లో కథనాలు వచ్చాయి. ‘‘అభివృద్ధి కోసమే మీతో పొత్తు పెట్టుకున్నాం. మీ పార్టీ, కాంగ్రెస్ కలిసే రాష్ట్రాన్ని విభజించాయి. సీమాంధ్రులకు ఇష్టం లేకున్నా విభజన జరిగింది. చేయని పాపానికి వాళ్లను ఎందుకు శిక్షించాలి? ప్రత్యేక హోదా ఇస్తే తప్ప రాష్ట్రం కోలుకోలేదు. ఏం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి. ఏం చేసి ఏపీని ఆదుకుంటారో చెప్పండి’’ అని ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారని ఒక పత్రిక రాసేసింది. […]
మంగళవారం జరిగిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మీడియాలో ఓ రేంజ్లో కథనాలు వచ్చాయి. ‘‘అభివృద్ధి కోసమే మీతో పొత్తు పెట్టుకున్నాం. మీ పార్టీ, కాంగ్రెస్ కలిసే రాష్ట్రాన్ని విభజించాయి. సీమాంధ్రులకు ఇష్టం లేకున్నా విభజన జరిగింది. చేయని పాపానికి వాళ్లను ఎందుకు శిక్షించాలి? ప్రత్యేక హోదా ఇస్తే తప్ప రాష్ట్రం కోలుకోలేదు. ఏం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి. ఏం చేసి ఏపీని ఆదుకుంటారో చెప్పండి’’ అని ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారని ఒక పత్రిక రాసేసింది. ప్రధానితో భేటీ అనంతరం ప్రెస్ మీట్లోనూ చంద్రబాబు ఎప్పటిలాగే జీవించేశారు. కానీ చంద్రబాబుతో భేటీ గురించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కానీ ట్వీట్‌లో ఎక్కడా కూడా తెలుగు మీడియా చెబుతున్నట్టుగా, బాబు ప్రెస్‌మీట్లో చెప్పినట్టుగా మ్యాటర్ లేదు.
ప్రత్యేక హోదా గురించి గానీ, ప్యాకేజ్ గురించి కానీ తనతో చంద్రబాబు చర్చించినట్టుగా మోదీ ఎక్కడా చెప్పలేదు. కేవలం కరువు నివారణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు తనకు వివరించారని (బ్రీఫ్డ్ మీ అన్న పదాన్ని మోదీ వాడారు) ట్వీట్ చేశారు. 20 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ కోసం చర్యలు తీసుకుంటున్నట్టుగా చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అన్నారు మోదీ. మైక్రో ఇరిగేషన్ అభివృధ్ధికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను ఆహ్వానిస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు. ఒకవేళ నిజంగా ప్రత్యేక హోదాపై చర్చించి ఉంటే మోదీ ట్వీట్లో తప్పనిసరిగా తెలియజేయాల్సింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం హోదా కోసం ఎదురుచూస్తోంది. హోదాపై ప్రధాని చెప్పే చిన్న ట్వీట్ కూడా ఇక్కడి ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కానీ అలా జరగలేదు. ఒకవేళ ప్రత్యేక హోదాపై జరిగిన చర్చల వివరాలను బయటకు చెప్పకూడదు అనేందుకు అదేమీ రహస్య అంశం కాదు కదా?.
నిజానికి చంద్రబాబు కరువుపై వివరించేందుకు ఢిల్లీ వెళ్లినట్టుగానే ఉంది. కానీ మీడియా మాత్రం చంద్రబాబు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని కాలర్ పట్టుకుని నిలదీసేందుకు వెళ్తున్నారన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. తీరా చూస్తే నిజంగా చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం మోదీని నిలదీశారనేది పక్కా ఆదారాలు లేకుండాపోయాయి. మోదీ కూడా తన ట్వీట్లో ప్రత్యేక హోదా వంటి అంశాలపై చర్చించినట్టు చెప్పకపోవడం గమనార్హం. బహుశా ప్రత్యేక హోదా తదితర అంశాలపై రహస్యంగా మాట్లాడుకున్నారు కాబోలు.
There was also a brief presentation by @ncbn on AP’s usage of technology to get real-time updates on water & agriculture from the ground.
— Narendra Modi (@narendramodi) May 17, 2016
AP has a target 20 lakh hectares for micro-irrigation. I welcome such efforts. We discussed global best practices & research in this field.
— Narendra Modi (@narendramodi) May 17, 2016
During our meeting today, CM @ncbn briefed me on the drought relief measures being undertaken in AP. https://t.co/pThB4qcYwJ
— Narendra Modi (@narendramodi) May 17, 2016
Click on Image to Read: