Telugu Global
NEWS

70 ఏళ్ల వ‌య‌సులో అలా చెప్ప‌డానికి సిగ్గులేదా ?

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను చంద్ర‌బాబు స్వార్థం కోసం తీవ్రంగా దెబ్బ‌తీస్తున్నార‌ని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిప‌డ్డారు. జ‌గ‌న్ జ‌ల‌దీక్ష‌లో ప్ర‌స‌గించిన ఆయ‌న‌.. రాష్ట్రాన్ని పాలించ‌డం చేత‌గాక‌పోతే టీడీపీని బీజేపీలో విలీనం చేయాల‌ని సూచించారు. చేత‌గాని చ‌వ‌ట ద‌ద్ద‌మ్మ‌లాగా చిప్ప చేతిలో ప‌ట్టుకుని ఢిల్లీ వెళ్లి అడుక్కోవ‌డానికి సిగ్గుగా లేదా అని ప్ర‌శ్నించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి అడుక్కున్నా… నాకే ఎందుకు ఈ ఖ‌ర్మ అంటూ చెప్పుకోవ‌డానికి 70 ఏళ్ల చంద్ర‌బాబుకు సిగ్గుండాల‌న్నారు. ఎన్టీఆర్ ఆత్మ‌గౌర‌వం కోసం పార్టీని స్థాపిస్తే […]

70 ఏళ్ల వ‌య‌సులో అలా చెప్ప‌డానికి సిగ్గులేదా ?
X

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను చంద్ర‌బాబు స్వార్థం కోసం తీవ్రంగా దెబ్బ‌తీస్తున్నార‌ని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిప‌డ్డారు. జ‌గ‌న్ జ‌ల‌దీక్ష‌లో ప్ర‌స‌గించిన ఆయ‌న‌.. రాష్ట్రాన్ని పాలించ‌డం చేత‌గాక‌పోతే టీడీపీని బీజేపీలో విలీనం చేయాల‌ని సూచించారు. చేత‌గాని చ‌వ‌ట ద‌ద్ద‌మ్మ‌లాగా చిప్ప చేతిలో ప‌ట్టుకుని ఢిల్లీ వెళ్లి అడుక్కోవ‌డానికి సిగ్గుగా లేదా అని ప్ర‌శ్నించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి అడుక్కున్నా… నాకే ఎందుకు ఈ ఖ‌ర్మ అంటూ చెప్పుకోవ‌డానికి 70 ఏళ్ల చంద్ర‌బాబుకు సిగ్గుండాల‌న్నారు.

ఎన్టీఆర్ ఆత్మ‌గౌర‌వం కోసం పార్టీని స్థాపిస్తే ఇప్పుడు అదే ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో మోదీ కాళ్ల వ‌ద్ద చంద్ర‌బాబు తాక‌ట్టు పెట్టార‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం మోదీ ఇంటి వ‌ద్ద‌నైనా, కేసీఆర్ ఇంటి వ‌ద్ద‌నైనా ధ‌ర్నా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ద‌మ్ముంటే చంద్రబాబు ముందుకు రావాల‌ని స‌వాల్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితేనే వారి నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివృధ్ధి చేస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నార‌ని… మోదీ కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న‌ట్టుగా ఉంద‌న్నారు. అందుకే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే ఏపీకి మోదీ సాయం చేస్తారేమోన‌ని కొడాలి అన్నారు. చంద్ర‌బాబుకు ద‌మ్ముధైర్యం ఉంటే, మ‌నిషి పుట్టుక పుట్టి వుంటే వెంట‌నే 17 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రావాల‌ని స‌వాల్ చేశారు.

Click on Image to Read:

jagan-deksha

Buddha-Sesha-Reddy

kodali-pardasaradi

devineni

ranga

modi-babu-meeting

thota-narasimham

babu1

YS-Jagan

11

Somu-Veerraju

pinchans

Kavita-Krishnan-free-sex

vishal-nadigar-elections

vishal-comments

First Published:  18 May 2016 8:09 AM IST
Next Story