కేసీఆర్ మాట నిలబెట్టుకుంటాడా?
సీఎం కేసీఆర్ తలపెట్టిన కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చి తేనెతుట్టెను కదిపారు. ఈ ప్రతిపాదనను కొందరు ఆహ్వానిస్తుంటే..మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో పరిపాలన, అభివృద్ధిలో వెనకబడ్డ తమ ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించాలని చాలా చోట్ల ఉద్యమాలు మొదలయ్యాయి. మరికొంత మంది తమ ప్రాంతాన్ని మరో జిల్లాలో విలీనం చేస్తే.. ఒప్పుకునేది లేదని పోరాటాలకు దిగుతున్నారు. స్థానికుల ఆందోళనలకు టీడీపీ, కాంగ్రెస్‌లు మద్దతు పలుకుతున్నాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో బంద్‌లు కూడా జరిగాయి. ఎన్నికల […]
BY admin18 May 2016 5:21 AM IST
X
admin Updated On: 18 May 2016 7:43 AM IST
సీఎం కేసీఆర్ తలపెట్టిన కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చి తేనెతుట్టెను కదిపారు. ఈ ప్రతిపాదనను కొందరు ఆహ్వానిస్తుంటే..మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో పరిపాలన, అభివృద్ధిలో వెనకబడ్డ తమ ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించాలని చాలా చోట్ల ఉద్యమాలు మొదలయ్యాయి. మరికొంత మంది తమ ప్రాంతాన్ని మరో జిల్లాలో విలీనం చేస్తే.. ఒప్పుకునేది లేదని పోరాటాలకు దిగుతున్నారు. స్థానికుల ఆందోళనలకు టీడీపీ, కాంగ్రెస్‌లు మద్దతు పలుకుతున్నాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో బంద్‌లు కూడా జరిగాయి. ఎన్నికల సమయంలో పలు వెనకబడిన ప్రాంతాలను జిల్లాలుగా మార్చి అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు చాలామంది ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలకు సిద్ధమయ్యారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జిల్లా సాధనసమితిల ఆధ్వర్యంలో ఆందోళనలు,బంద్ పిలుపులు విజయవంతం కావడం అక్కడి ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తున్నాయి. కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
రగిలిన కొత్త జిల్లాల కుంపటి!
ములుగును జిల్లాగా చేస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీ అమలుకు టీడీపీ నాయకులరాలు సీతక్క ఆధ్వర్యంలో అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే. అరుణ కూడా ఉద్యమిస్తున్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం సీఎస్‌ను కూడా కలిశారు. మరోవైపు వరంగల్ జిల్లాలో డోర్నకల్ ను ఖమ్మంలో విలీనం చేయాలని కోరుతూ ఉద్యమాలు మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన మంథనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఉద్యమం మొదలైంది. తమ ప్రాంతాన్ని భూపాలపల్లి జిల్లాలో విలీనం చేస్తే.. సహించేది లేదని స్థానికులు కేసీఆర్‌కు స్పష్టం చేశారు. మొత్తానికి సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన ప్రజలను మరోసారి ఉద్యమ బాట పట్టిస్తోంది. మరి ఈ జిల్లా సాధన సమితిల ఆకాంక్షలు నెరవేరతాయా? కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేదా ? అన్నది చూడాలి మరి!
Next Story