ఉత్తమ్‌కు పదవీగండం?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయించినా.. అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్‌కు వరుస పరాజయాలు, భంగపాట్లు తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పార్లమెంటు స్థానాలకు, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలువచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ సిద్ధిపేట తదితర ఇతర చిన్న మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎక్కడా కాంగ్రెస్ తన మార్కు చూపించలేకపోయింది. పైగా ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కారెక్కడం ఆపార్టీని రాజకీయంగా బలహీనం చేసింది. దీనికితోడు ఆ పార్టీకి చెందిన […]
BY admin17 May 2016 5:49 AM IST
X
admin Updated On: 17 May 2016 1:21 PM IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయించినా.. అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్‌కు వరుస పరాజయాలు, భంగపాట్లు తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పార్లమెంటు స్థానాలకు, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలువచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ సిద్ధిపేట తదితర ఇతర చిన్న మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎక్కడా కాంగ్రెస్ తన మార్కు చూపించలేకపోయింది. పైగా ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కారెక్కడం ఆపార్టీని రాజకీయంగా బలహీనం చేసింది. దీనికితోడు ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి (నారాయణ ఖేడ్), రాంరెడ్డి వెంకటరెడ్డి (పాలేరు) హఠాన్మరణం చెందారు. వీటిలో నారాయణ ఖేడ్‌లో ఇప్పటికే గులాబీ జెండా ఎగరేసింది. తాజాగా పాలేరులోనూ గులాబీ గుభాళిస్తుందన్న వార్తలు కాంగ్రెస్ శిబిరంలో ఆందోళనలు రేగుతున్నాయి. ఒక్క మెదక్ పార్లమెంటు ఉప ఎన్నిక మినహాయిస్తే.. మిగిలిన అన్ని ఎన్నికలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ నేతృత్వంలోనే జరిగాయి. పార్టీని, కేడర్‌ను నడిపించడంలో ఆయన విఫలమయ్యాడని… వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ.. ఉత్తమ్ రాజీనామా చేయాలని అసంతృప్త నేతలు తమ డిమాండ్ ను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు.
ఇక ఉత్తమ్‌కు స్వస్తి పలుకుతారా?
వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌కు ఇప్పటికిప్పుడు కొత్త సారధి కావాలి. పార్టీని విజయతీరాలకు చేర్చకున్నప్పటికీ.. కనీసం ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ఎండగట్టే సమర్థ నాయకుడి అవసరం కాంగ్రెస్‌కు ఎంతైనా ఉందని సొంతపార్టీ నేతలే చెబుతున్నారు. ఉత్తమ్ పనితీరుపై పార్టీ నాయకులు చాలా సార్లు బహిరంగంగానే కామెంట్లు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశాడు. తన పదవికి రాజీనామా చేసిన వెంటనే.. టీపీసీసీ చీఫ్ కూడా నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా.. ఉత్తమ్ స్పందించలేదు. తరువాత జరిగిన నారాయణ్‌ఖేడ్ ఓటమిని సైతం ఉత్తమ్ పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. తాజాగా పాలేరులో కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీపై మాటల దాడి పెంచినా.. ఓటమి తప్పదన్న ప్రచారం మొదలైంది. దీంతో ఉత్తమ్ వ్యతిరేకవర్గం టీపీసీసీ పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ను తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ఉందని సమాచారం. ఈ విషయాన్ని దిగ్విజయ్ తో నేడు జరిగే సమావేశంలోనే తేల్చుకోవాలని పలువురు భావిస్తున్నట్లు సమాచారం.
Next Story