ఆ పనికి కూడా డబ్బులు తీసుకుందట...
కాజల్ మనకు ఫేస్ బుక్ లో మాత్రమే కనిపిస్తుంది. ఆమె పెద్దగా అందులో అప్ డేట్స్ పెట్టకపోయినప్పటికీ… ఆమెకంటూ సోషల్ మీడియాలో ఓ అఫీషియల్ ఎకౌంట్ అదొక్కటే. అయితే తాజాగా కాజల్ ట్విట్టర్ లోకి కూడా ఎంటరైంది. నిజానికి ఆమెకు మరో సోషల్ సైట్ ఎకౌంట్ ఓపెన్ చేయడం ఇష్టంలేదు. అందుకే ఇన్నాళ్లూ ట్విట్టర్ కు దూరంగా ఉంది. కానీ ఈసారి ట్విట్టర్ లో ఖాతా తెరవడానికి ఏకంగా ఆమె డబ్బులు కూడా తీసుకుందట. బ్రహ్మోత్సవం సినిమా […]
BY sarvi17 May 2016 5:56 AM IST
X
sarvi Updated On: 17 May 2016 9:17 AM IST
కాజల్ మనకు ఫేస్ బుక్ లో మాత్రమే కనిపిస్తుంది. ఆమె పెద్దగా అందులో అప్ డేట్స్ పెట్టకపోయినప్పటికీ… ఆమెకంటూ సోషల్ మీడియాలో ఓ అఫీషియల్ ఎకౌంట్ అదొక్కటే. అయితే తాజాగా కాజల్ ట్విట్టర్ లోకి కూడా ఎంటరైంది. నిజానికి ఆమెకు మరో సోషల్ సైట్ ఎకౌంట్ ఓపెన్ చేయడం ఇష్టంలేదు. అందుకే ఇన్నాళ్లూ ట్విట్టర్ కు దూరంగా ఉంది. కానీ ఈసారి ట్విట్టర్ లో ఖాతా తెరవడానికి ఏకంగా ఆమె డబ్బులు కూడా తీసుకుందట. బ్రహ్మోత్సవం సినిమా ప్రమోషన్ లో భాగంగా… ట్విట్టర్ లో ప్రచారం చేయమని నిర్మాత పీవీపీ కోరాడట. అలా చేయాలంటే తనకు ఎక్స్ ట్రా ఎమౌంట్ కావాలని కాజల్ డిమాండ్ చేసిందట. తప్పని పరిస్థితిలో పీవీపీ కాజల్ కు కాస్త ఎమౌంట్ సమర్పించుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి తన క్రేజ్ ను ఇలా కూడా వాడుకుంటోంది కాజల్. ట్విట్టర్ లో ఎకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా కాజల్ డబ్బులు తీసుకుందనే వార్త తెలిసి టోటల్ ఫిలింనగర్ అవాక్కయింది. నిజానికి హీరోయిన్లు ప్రతి విషయాన్ని కమర్షియల్ గానే ఆలోచిస్తారు. రిబ్బన్ కటింగ్స్ నుంచి ఫొటోల వరకు అన్నింటికీ చార్జ్ చేశారు. కానీ సోషల్ మీడియాలో ఎకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా డబ్బులు తీసుకోవచ్చని కాజల్ నిరూపించింది. ఫ్యూచర్ లో ఇంకెంతమంది హీరోయిన్లు కాజల్ ను ఫాలో అవుతారో చూడాలి.
Next Story