కొత్త జిల్లాల ఏర్పాటు అందుకోసమా?
కొత్త జిల్లాల ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణలో కరువును మరుగున పరిచేందుకే కేసీఆర్ కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకువచ్చాడని ఆరోపించాడు. ఏమైందో ఏమోగానీ.. ప్రశాంతంగా కనిపించే లచ్చన్న ఉన్నపలంగా సీఎం మీద ఉరిమాడు. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశాడు. కరువు బాధిత గ్రామాలపై సీఎం అస్సలు దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఓ వైపు కరవు తాండవిస్తోంటే.. కొత్త జిల్లాల ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. ఆయన మరో […]
BY admin16 May 2016 11:22 PM GMT
X
admin Updated On: 17 May 2016 12:53 AM GMT
కొత్త జిల్లాల ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణలో కరువును మరుగున పరిచేందుకే కేసీఆర్ కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకువచ్చాడని ఆరోపించాడు. ఏమైందో ఏమోగానీ.. ప్రశాంతంగా కనిపించే లచ్చన్న ఉన్నపలంగా సీఎం మీద ఉరిమాడు. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశాడు. కరువు బాధిత గ్రామాలపై సీఎం అస్సలు దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఓ వైపు కరవు తాండవిస్తోంటే.. కొత్త జిల్లాల ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. ఆయన మరో సంచనల విషయం కూడా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రూ.791 కోట్లు ఇస్తే.. ఖర్చు పెట్టడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. అంతేనా.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ చాటుకున్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో రెండు రాష్ర్టాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూమ్, కేజీ టు పీజీ ఇతర పథకాలు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన కరీంనగర్ నుంచే ఆయన పతనానికి నాంది పలుకుతామని వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణ వాదుల ఆగ్రహం..!
బీజేపీపై తెలంగాణవాదులు, గులాబీనేతలు మండిపడుతున్నారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకురావడం చేతగాదుగానీ…. వందల కోట్లు మీకు మాత్రం గుట్టుగా ఎలా తెలిసింది? అని పాయింట్ లాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ కుట్ర పన్నినపుడు నోరు మెదపని బీజేపీకి తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని మండిపడుతున్నారు. ఉద్యమాల పురిటి గడ్డ అయిన కరీంనగర్‌లో నిలుచుని ఏపీకి అనుకూలంగా మాట్లాడేందుకు మీకు నోరెలా వచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు చేతనైతే టీడీపీ పొత్తు లేకుండా గెలిచి చూపించాలని సవాల్ విసురుతున్నారు.
Next Story