కులంపేరుతోనూ టార్గెట్ చేశారు... తిట్టిన అమ్మే గెలిచి తీరాలని ధైర్యం చెప్పింది
నడిగర్ ఎన్నికల బరిలో దిగినప్పుడు ఎదురైన అనుభవాలను హీరో విశాల్ చెప్పారు. తమిళనాడులో జనానికి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ లేదని కొందరు కావాలనే రెచ్చగొడుతుంటారని చెప్పారు. నడిగర్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రత్యర్థి వర్గం తనను నాన్ లోకల్ పేరుతో టార్గెట్ చేసిందన్నారు. విశాల్ రెడ్డి విశాల్ రెడ్డి అంటూ ప్రచారం చేశారని గుర్తు చేసుకున్నాడు. కానీ ఏదీ నిజమో ఓటర్లు గుర్తించారన్నారు. ఎన్నికల బరిలో దిగినప్పుడు ఇవన్నీ మనకు అవసరమా అని అమ్మానాన్న తిట్టారన్నారు. […]
నడిగర్ ఎన్నికల బరిలో దిగినప్పుడు ఎదురైన అనుభవాలను హీరో విశాల్ చెప్పారు. తమిళనాడులో జనానికి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ లేదని కొందరు కావాలనే రెచ్చగొడుతుంటారని చెప్పారు. నడిగర్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రత్యర్థి వర్గం తనను నాన్ లోకల్ పేరుతో టార్గెట్ చేసిందన్నారు. విశాల్ రెడ్డి విశాల్ రెడ్డి అంటూ ప్రచారం చేశారని గుర్తు చేసుకున్నాడు. కానీ ఏదీ నిజమో ఓటర్లు గుర్తించారన్నారు. ఎన్నికల బరిలో దిగినప్పుడు ఇవన్నీ మనకు అవసరమా అని అమ్మానాన్న తిట్టారన్నారు. కానీ ఒక రోజు తన అమ్మ మార్కెట్‌కు వెళ్లగా అక్కడ ఒకామె మీ అబ్బాయి ఒక మంచి పని కోసం ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నాడమ్మ అని మెచ్చుకున్నట్టు చెప్పాడు. దీంతో ఇంటికి వచ్చిన తన తల్లి ఏమైనా సరే చివరి వరకు పోరాడాలని చెప్పిందన్నారు. మార్కెట్ లో మహిళ మాటలు తనకు ఎంతో గర్వంగా అనిపించాయని తన తల్లి చెప్పిందన్నారు విశాల్.
గత అసోసియేషన్ హయాంలో నడిగర్ కు ఉన్న రూ. 9 కోట్ల అప్పును తీర్చేశామన్నారు. 25 కోట్లతో భవనం కడుతున్నట్టు చెప్పారు. ఇందులో కల్యాణమండలం, థియేటర్, సెమినార్ హాల్‌తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భవనం ద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని నేరుగా పేద ఆర్టిస్టుల పించన్ నిధికి అనుసంధానం చేస్తామని చెప్పారు. అక్కడ కట్టే కల్యాణ మండపంలోనే తన పెళ్లి జరుగుతుందని చెప్పారు. ఏ మాత్రం తేడా వచ్చినా తమను ప్రత్యర్థులు టార్గెట్ చేస్తారని అందుకే తాను హీరో కార్తీ కలిసి ప్రతి రూపాయికి కూడా అకౌంట్ రెడీ చేస్తున్నామని చెప్పాడు. 30, 40 ఏళ్ల పాటు ఆర్టిస్టులుగా పని చేసిన వారు నేడు చినిగిన బట్టలతో వచ్చి నిలబడుతుంటే చాలా బాధగా అనిపించిందన్నారు. అలాంటి వారందరికీ అసోసియేషన్ అండగా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నాడు విశాల్.
Click on Image to Read: