కేసీఆర్ కు మరో ఝలక్!
టీఆర్ ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి పెంచింది. మాటల్లో పదును రెట్టించింది. వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలు ఆలోచింపజేసే విధంగా ఉండటం గమనార్హం. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు సిరిసిల్ల టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కొత్త చర్చకు తెరలేపారు. తరువాత దాన్ని మిగిలిన సీనియర్ నాయకులు కొనసాగిస్తున్నారు. మొన్న నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అమరుల కుటుంబాలను రాజ్యసభకు ఎందుకు పంపడం […]
BY sarvi16 May 2016 2:30 AM IST
X
sarvi Updated On: 16 May 2016 1:44 PM IST
టీఆర్ ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి పెంచింది. మాటల్లో పదును రెట్టించింది. వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలు ఆలోచింపజేసే విధంగా ఉండటం గమనార్హం. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు సిరిసిల్ల టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కొత్త చర్చకు తెరలేపారు. తరువాత దాన్ని మిగిలిన సీనియర్ నాయకులు కొనసాగిస్తున్నారు. మొన్న నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అమరుల కుటుంబాలను రాజ్యసభకు ఎందుకు పంపడం లేదు? అని సూటి ప్రశ్న వేశారు. పార్టీ ఫిరాయింలను ప్రోత్సహిస్తోన్న కేసీఆర్ అమరుల కుటుంబాలకు ఎందుకు పదవులు ఇవ్వడం లేదు ? అన్న గుత్తా వాదనలోనూ నిజముందని పలువురు తెలంగాణవాదులు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. తాజాగా మల్లు రవి కూడా మరో సూటి విమర్శ చేశారు. కాకపోతే ఆ బాణం నేరుగా వెళ్లి కేటీఆర్ కు తగలడం గమనార్హం.
ఆ యూనివర్సిటీలోనే కేసీఆర్ చదివారు కదా?
పాలేరు ప్రచారం ముగింపు సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్‌పై చెలరేగిపోయారు. కాంగ్రెస్.. ఓ అవినీతి యూనివర్సిటీ అని అక్కడ చదివిన నేతలు అక్రమాల్లో పట్టభద్రులవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి యూనివర్సిటీ అనడాన్ని తప్పుబట్టారు. మరి అలా అయితే, మీ నాయన కేసీఆర్ అక్షరాభ్యాసం కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది.. అన్న విషయం మరువరాదని గుర్తు చేశారు. కేసీఆర్ తోపాటు గులాబీపార్టీలో ఉన్న సీనియర్ నేతలు కేకే, డీఎస్‌లు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. గతం మరిచి మాట్లాడవద్దని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులపై గతకొంతకాలంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తోన్న ఆరోపణలతో కేడర్‌లో ఆత్మస్థైర్యం నిండుతోందని సమాచారం. ఇకపోతే.. దీనికి గులాబీ నేతలు సైతం అదే విధంగా స్పందిస్తున్నారు. 2009లో మాపార్టీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకున్నపుడు ఈ విషయాలేవీ మీకెందుకు గుర్తులేవని నిలదీస్తున్నారు.
Click on Image to Read:
Next Story