బాబుపై వీర్రాజు భగ భగ
ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ విడిపోయిన రాష్ట్రాలు ఏవీ రాజధాని కోసం చంద్రబాబులా వెంపర్లాడలేదని మండిపడ్డారు. విశాఖలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. కేంద్రప్రభుత్వం ఏపీ రాజధానికోసం ఎంతో సాయం చేసిందని లెక్కలతో సహా చెప్పారు. కానీ చంద్రబాబు అమరావతి రాజధానిని హెరిటేజ్ సిటిగా మార్చారని మండిపడ్డారు. రాజధానికోసం లక్షల కోట్లు అడగడం ఎంతవరకు […]
ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ విడిపోయిన రాష్ట్రాలు ఏవీ రాజధాని కోసం చంద్రబాబులా వెంపర్లాడలేదని మండిపడ్డారు. విశాఖలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. కేంద్రప్రభుత్వం ఏపీ రాజధానికోసం ఎంతో సాయం చేసిందని లెక్కలతో సహా చెప్పారు. కానీ చంద్రబాబు అమరావతి రాజధానిని హెరిటేజ్ సిటిగా మార్చారని మండిపడ్డారు.
రాజధానికోసం లక్షల కోట్లు అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో చేయడం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందడమే తమ పార్టీ అభిప్రాయమని అంతేగానీ నిధులన్ని అమరావతిలోనే గుమ్మరించడం సమంజసం కాదని దీనికి బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడమంటే ఆర్థిక సాయమే అని వివరణ చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి వీర్రాజు డిమాండ్ చేశారు.
Click on Image to Read: