మహాత్మా గాంధీ మనుమడితో మాట్లాడిన మోడీ!
మహాత్మా గాంధీ మనుమడు కనూభాయి గాంధీతో ప్రధాని మోడీ ఫోన్లో సంభాషించారు. కనూభాయి (87), తన భార్య శివలక్ష్మి(85)తో కలిసి ఢిల్లీలోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ప్రధాని మోడీ, మహాత్మా గాంధీ మనుమడితో సోమవారం ఫోన్లో మాట్లాడారని, కనూభాయిని కలిసి, ఆయన అక్కడ సౌకర్యవంతంగా ఉన్నారో లేదో తెలుసుకోవాల్సిందిగా సాంస్కృతిక శాఖా మంత్రి మహేష్ శర్మని ఆయన ఆదేశించారని ప్రధాని కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. దక్షిణ ఢిల్లీలో ఉన్న గురు విశ్రామ్ వృద్ధ్ ఆశ్రమంలో ఉంటున్న గాంధీ […]
మహాత్మా గాంధీ మనుమడు కనూభాయి గాంధీతో ప్రధాని మోడీ ఫోన్లో సంభాషించారు. కనూభాయి (87), తన భార్య శివలక్ష్మి(85)తో కలిసి ఢిల్లీలోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ప్రధాని మోడీ, మహాత్మా గాంధీ మనుమడితో సోమవారం ఫోన్లో మాట్లాడారని, కనూభాయిని కలిసి, ఆయన అక్కడ సౌకర్యవంతంగా ఉన్నారో లేదో తెలుసుకోవాల్సిందిగా సాంస్కృతిక శాఖా మంత్రి మహేష్ శర్మని ఆయన ఆదేశించారని ప్రధాని కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. దక్షిణ ఢిల్లీలో ఉన్న గురు విశ్రామ్ వృద్ధ్ ఆశ్రమంలో ఉంటున్న గాంధీ మనుమడితో మహేష్ శర్మ 45 నిముషాలపాటు ముచ్చటించారు.
ఈ సంఘటనల అనంతరం కనూభాయి గాంధీ పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడారు. తాను మోడీకి పాత అనుచరుడినని, ఆ రోజుల్లో సోనియా గాంధీ తమకు వ్యతిరేకంగా ఉన్నపుడు మోడీకి తాను సహాయం చేశానని, ఆయన అదంతా గుర్తు పెట్టుకున్నారని అన్నారు. మోడీ గుజరాతీ భాషని బాగా అర్థం చేసుకుంటారని చెప్పారు. కాగా ఆదివారం ఈ వృద్ధజంటని మరొక కేంద్ర మంత్రి సందీప్ కుమార్ కలిశారు.
కనూభాయి గాంధీ, ఆయన భార్య శివలక్ష్మి నాలుగు దశాబ్దాలు అమెరికాలో నివసించిన అనంతరం 2014లో ఇండియా తిరిగి వచ్చారు. తొలుత కనూభాయి తన 17ఏళ్ల వయసులో అమెరికా వెళ్లి మసాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు. తరువాత నాసాలో పనిచేశారు. ఆయన భార్య బయో కెమిస్ట్రీలో డాక్టరేట్ చేశారు. మహాత్మాగాంధీ మూడో కుమారుడు రామదాసుకి పెద్దకుమారుడు కనూభాయి గాంధీ.