జగన్‌కు హరీష్ హెచ్చరిక... ఇంటి ముట్టడికి విద్యార్థుల యత్నం
జగన్ దీక్షకారణంగా తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశం చర్చనీయాంశమైంది. అయితే జగన్‌పై అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా విరుచుకుపడ్డాయి. ఏపీ మంత్రి దేవినేని ఉమా… రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి వైఎస్సే కారమని ఆరోపించారు. చంద్రబాబు మండుటెండలో కష్టపడుతుంటే జగన్ మాత్రం అప్పుడప్పుడు బయటకు వచ్చి దీక్షలు ధర్నాలు అంటున్నారని విమర్శించారు. అటు జగన్ దీక్షపై టీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ దీక్షలు మానుకోవాలని […]
జగన్ దీక్షకారణంగా తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశం చర్చనీయాంశమైంది. అయితే జగన్‌పై అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా విరుచుకుపడ్డాయి. ఏపీ మంత్రి దేవినేని ఉమా… రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి వైఎస్సే కారమని ఆరోపించారు. చంద్రబాబు మండుటెండలో కష్టపడుతుంటే జగన్ మాత్రం అప్పుడప్పుడు బయటకు వచ్చి దీక్షలు ధర్నాలు అంటున్నారని విమర్శించారు. అటు జగన్ దీక్షపై టీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ దీక్షలు మానుకోవాలని సూచించారు. వైఎస్ వల్లే తెలంగాణకు రావాల్సిన నీరు ఆంధ్రా ప్రాంతానికి తరలివెళ్లిందని ఆరోపించారు. తెలంగాణప్రాజెక్టులకు అడ్డుపడితే మరో మానుకోట ఘటన పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ఒకడు దీక్షలంటూ, మరొకడు కోర్టులంటూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ మండిపడ్డారు.
సాగునీటి ప్రాజెక్టులపై చర్చలకు ఆహ్వానించినా ఏపీ మంత్రి దేవినేని ముందుకు రావడం లేదని హరీష్ చెప్పారు. మరోవైపు తెలంగాణ నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ దీక్షను నిరసిస్తూ విద్యార్థి జేఏసీ సభ్యులు లోటస్ పాండ్‌లోని జగన్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మొత్తం మీద అటు ఏపీకి వైఎస్ వల్లే అన్యాయం జరిగిందని దేవినేని అంటుంటే… ఇటు హరీష్ మాత్రం తెలంగాణ జలాలను ఆంధ్రాకు తరలించింది వైఎస్సేనని విమర్శించడం గమ్మత్తుగానే ఉంది.
Click on Image to Read: