బాబు పాలనలో బ్రహ్మంగారి "పచ్చబండ" నిజమయ్యేలా ఉంది!
రాయలసీమ విషయంలో చంద్రబాబు వైఖరిని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు అభివృద్ధిని మొత్తం అమరావతిలోనే కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని విమర్శించారు. రాయలసీమకు నీరు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలంలో నీటి మట్టం చరిత్రలో లేని విధంగా పడిపోయినప్పటికీ దిగువకు నీరు వదలడాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు తీరుతో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పినట్టు శ్రీశైలం డ్యాంలో పచ్చబండ బయటపడేలా […]
రాయలసీమ విషయంలో చంద్రబాబు వైఖరిని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు అభివృద్ధిని మొత్తం అమరావతిలోనే కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని విమర్శించారు. రాయలసీమకు నీరు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలంలో నీటి మట్టం చరిత్రలో లేని విధంగా పడిపోయినప్పటికీ దిగువకు నీరు వదలడాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు తీరుతో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు.
కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పినట్టు శ్రీశైలం డ్యాంలో పచ్చబండ బయటపడేలా ఉందన్నారు. బాబు పాలనలో అది జరుగుతుందనిపిస్తోందని బైరెడ్డి అన్నారు. జగన్ కర్నూలులో కాకుండా కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేయాలని బైరెడ్డి సూచించారు. కర్నూలులో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవంలో కర్నూలు జిల్లాకు 25కు పైగా హామీలు ఇచ్చారని వాటిలో ఒక్కటైనా నేరవేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒంట్లో రాయలసీమ రక్తమే ఉంటే సిద్దేశ్వరం అలుగు, వేదావతి ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకోవాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 776 అడుగులకు పడిపోయింది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.07 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ స్లూయిస్ గేట్ ద్వారా ఏకధాటిగా 5వేల 460 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రాయలసీమకు నీరు అందాలంటే శ్రీశైలంలో కనీసం 845 అడుగుల నీటి మట్టం ఉండాలి. కానీ చరిత్రలో లేని విధంగా శ్రీశైలం నీటి మట్టాన్ని పడగొట్టేశారు.
Click on Image to Read: