ఆమెకు నాకంటే మంచి భర్తే వచ్చాడు... అమ్మాయిని అడ్డుపెట్టుకుని యుద్ధం చేయలేను
హీరో విశాల్ ఒక ఇంటర్వ్యూలో తన జీవితం గురించి అనేక విషయాలు చెప్పారు. వరలక్ష్మితో పెళ్లికి నిరాకరించడం వల్లే శరత్‌కుమార్‌పై కోపంతో నడిగర్ ఎన్నికల్లో పోటీ చేశారని వస్తున్న వార్తలను ఖండించారు. అమ్మాయిని అడ్డుపెట్టుకుని యుద్ధం చేసే విద్య తనకు తెలియదన్నారు. తన కోసం ఆమె తండ్రితో ఫైట్ చేసే క్యారెక్టర్ తనది కాదన్నారు. కేవలం సిని పరిశ్రమ మంచి కోసమే ఎన్నికల బరిలో దిగానని చెప్పారు. వరలక్ష్మి తాను చిన్ననాటి స్నేహితులమని చెప్పారు. తను నేను […]
హీరో విశాల్ ఒక ఇంటర్వ్యూలో తన జీవితం గురించి అనేక విషయాలు చెప్పారు. వరలక్ష్మితో పెళ్లికి నిరాకరించడం వల్లే శరత్‌కుమార్‌పై కోపంతో నడిగర్ ఎన్నికల్లో పోటీ చేశారని వస్తున్న వార్తలను ఖండించారు. అమ్మాయిని అడ్డుపెట్టుకుని యుద్ధం చేసే విద్య తనకు తెలియదన్నారు. తన కోసం ఆమె తండ్రితో ఫైట్ చేసే క్యారెక్టర్ తనది కాదన్నారు. కేవలం సిని పరిశ్రమ మంచి కోసమే ఎన్నికల బరిలో దిగానని చెప్పారు. వరలక్ష్మి తాను చిన్ననాటి స్నేహితులమని చెప్పారు. తను నేను చిన్నప్పటి నుంచి సన్నిహితంగానే ఉండేవారిమన్నారు.
సినీ పరిశ్రమలోని పేద ఆర్టిస్టులను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే 25 కోట్లతో భారీ భవనం నిర్మిస్తున్నట్టు చెప్పారు. అందులో కల్యాణమండలం, థియేటర్, సెమినార్ హాల్‌తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భవనం ద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని నేరుగా పేద ఆర్టిస్టుల పించన్ నిధికి అనుసంధానం చేస్తామని చెప్పారు. కాలేజ్ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించానని విశాల్ చెప్పాడు. అయితే ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని చెప్పాడు. తాను సినిమాల్లో హీరోయిన్లతో రోమాన్స్ చేయడం చూడలేనని కాబట్టి సినిమాలు కావాలో, తాను కావాలో తేల్చుకోవాల్సిందిగా ప్రేమించిన అమ్మాయి చెప్పిందన్నారు. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి తన కంటే మంచి భర్త వచ్చాడని విశాల్ చెప్పాడు.
తన సినిమాలు వరుసగా హిట్ అయిన ఏడాదిన తన పుట్టినరోజు నాడు రెండు వందల బొకేలు వచ్చిన సన్నివేశం చూశానని… అదే వరుసగా సినిమాలు ప్లాప్ అయిన ఏడాది కేవలం ఓకే ఒక్క బొకే వచ్చిన సన్నివేశం కూడా గుర్తుందన్నారు. తాను రెండు రకాలపరిస్థితులు చూసిన వాడినని చెప్పారు. గెలిచినా ఓడినా వచ్చే ఒకేఒక్క బొకే మాత్రమే నిజమైనదన్నారు విశాల్.
Click on Image to Read: