కూల్చబోయారు... ఇప్పుడు కూలిపోతున్నారు...
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు ఇది పెద్ద ఎదురు దెబ్బే! ఇక తెలంగాణలో టీడీపీ జెండా పీకేసే రోజులు దగ్గర పడినట్లే కనిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఇప్పటికే గులాబీ కండువాలు కప్పుకుని అసెంబ్లీలో ఆపార్టీని టీఆర్ ఎస్‌లో విలీనం చేశారు. తాజాగా ఆ పార్టీ తెలంగాణ శాఖను మొత్తం టీఆర్ ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కనుందంటూ ఓ పత్రిక ప్రచురించింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేందరూ తమ పార్టీని […]
BY admin14 May 2016 9:30 PM GMT
X
admin Updated On: 15 May 2016 9:59 AM GMT
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు ఇది పెద్ద ఎదురు దెబ్బే! ఇక తెలంగాణలో టీడీపీ జెండా పీకేసే రోజులు దగ్గర పడినట్లే కనిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఇప్పటికే గులాబీ కండువాలు కప్పుకుని అసెంబ్లీలో ఆపార్టీని టీఆర్ ఎస్‌లో విలీనం చేశారు. తాజాగా ఆ పార్టీ తెలంగాణ శాఖను మొత్తం టీఆర్ ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కనుందంటూ ఓ పత్రిక ప్రచురించింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేందరూ తమ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేస్తున్నామని లేఖ ఇచ్చిన విధంగానే.. తాజాగా ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్.రమణతోపాటు మరో ఐదారు మంది టీడీపీ జిల్లా అధ్యక్షులు తమ పార్టీని టీఆర్ ఎస్‌లో విలీనం చేస్తున్నామంటూ ఎన్నికల కమిషనర్‌కు త్వరలోనే లేఖ ఇవ్వనున్నారని ఆ కథనం సారాంశం.
ఇదే గనక నిజమైతే తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయినట్లే..! ఇక ఆ పార్టీ తెలంగాణలో జెండా పీకేయడం లాంఛనమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఊహించని షాక్ అని చెబుతున్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారన్న అపవాదు ఎదుర్కొంటున్న చంద్రబాబు పార్టీ విలీనంపై నోరు మెదపడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. కనీసం వైసీపీ విమర్శలకైనా టీడీపీ స్పందించడం లేదు.
టీటీడీపీ బాధ్యతను తన భుజాలపైన వేసుకున్నా పార్టీని మాత్రం కాపాడుకోలేకపోయారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో లోకేష్ సుడిగాలి ప్రచారం చేసినా పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్క కార్పొరేటర్‌ను మాత్రమే గెలిపించుకోగలిగారు. ఆ ఫలితాల తరువాత టీడీపీ దాదాపు కోమాలోకి వెళ్లిపోయింది. అవశేషాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి.
రమణ, సండ్ర కూడా వెళతారా?
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఇటీవల టీఆర్ ఎస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. దీనిని ఆయన ఖండించినా.. ప్రచారం మాత్రం ఆగడం లేదు. అలాగే ఓటుకునోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం) కూడా కారెక్కుతారన్న ప్రచారం ఆగడం లేదు. ఆయన టీఆర్ఎస్ లో చేరడానికి నాయకత్వంతో మంతనాలు జరిపారని, బయటకు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నా ఆయన చేరిక ఖరారైనట్లు సమాచారం. అలాగే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ సైతం తాను పార్టీ మారడం లేదని అంటున్నా.. ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. పార్టీ వర్గాలు సమాచారం మేరకు టీటీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్, మరికొద్ది మంది నాయకులే మిగిలే అవకాశం ఉందంటున్నారు.
Next Story