బంపర్ ఆఫర్ కొట్టేసిన డీ ఎస్?
ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన డీఎస్ టీఆర్‌ఎస్ లో చేరాక కేవలం సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన అనుచరులు వాపోతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయనకు రాజ్యసభ రూపంలో బంపర్ ఆఫర్ వచ్చింది. జూన్ 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెండుస్థానాలను గెలుచుకోనుంది. ఈ రెండు స్థానాల్లో డీఎస్‌కు అవకాశం ఇవ్వనున్నారు. దీనిపై నిర్ణయం దాదాపు ఖాయమైపోయిందని చెబుతున్నారు. అవకాశం కోసం ఐదుగురు సీనియర్లు […]

ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన డీఎస్ టీఆర్‌ఎస్ లో చేరాక కేవలం సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన అనుచరులు వాపోతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయనకు రాజ్యసభ రూపంలో బంపర్ ఆఫర్ వచ్చింది. జూన్ 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెండుస్థానాలను గెలుచుకోనుంది. ఈ రెండు స్థానాల్లో డీఎస్‌కు అవకాశం ఇవ్వనున్నారు. దీనిపై నిర్ణయం దాదాపు ఖాయమైపోయిందని చెబుతున్నారు. అవకాశం కోసం ఐదుగురు సీనియర్లు పోటీపడుతుండగా డీఎస్ తరపున ఎంపీ కవిత చక్రం తిప్పారని చెబుతున్నారు. బీసీ వ్యక్తి కావడంతో పాటు సీనియర్ నేత అయిన డీఎస్ లాంటివారు ఢిల్లీలో ఉండడం పార్టీకి మంచిదన్న ఉద్దేశంతోనే డీఎస్ వైపు పార్టీ నాయకత్వం మొగ్గుచూపుతోందని చెబుతున్నారు. గతంలో పీసీసీ చీఫ్‌గా చేసిన కేకే కూడా టీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు డీఎస్ కూడా ఆదే కోవలో ఢిల్లీ పెద్దల సభకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
Click on Image to Read: