ఈసారి పెళ్లి గ్యారెంటీ అంటున్న సల్మాన్
ఈమధ్యే హాఫ్ సెంచరీ కొట్టాడు. వయసు రీత్యా 50ఏళ్లు దాటిపోయాడు. ఇప్పటికీ పెళ్లి చేసుకోపోతే బావుండదని భావించాడో ఏమో… త్వరలోనే పెళ్లి ప్రకటన వస్తుందని ఊరిస్తున్నాడు సల్మాన్ ఖాన్. అన్నీ అనుకున్నట్టు జరిగితే… హీరోయిన్ ప్రీతి జింటా పెళ్లి రిసెప్షన్ లో తన పెళ్లి ప్రకటన చేసే ఆలోచనలో సల్మాన్ ఉన్నాడట. ఇప్పటికే రొమేనియా దేశానికి చెందిన లులియా అనే మోడల్ తో సన్నిహితంగా ఉంటున్నాడు సల్మాన్ ఖాన్. దాదాపు ముడేళ్లుగా వాళ్లిద్దరి మధ్య డేటింగ్ నడుస్తోంది. […]
BY sarvi14 May 2016 4:31 AM IST
X
sarvi Updated On: 14 May 2016 6:14 AM IST
ఈమధ్యే హాఫ్ సెంచరీ కొట్టాడు. వయసు రీత్యా 50ఏళ్లు దాటిపోయాడు. ఇప్పటికీ పెళ్లి చేసుకోపోతే బావుండదని భావించాడో ఏమో… త్వరలోనే పెళ్లి ప్రకటన వస్తుందని ఊరిస్తున్నాడు సల్మాన్ ఖాన్. అన్నీ అనుకున్నట్టు జరిగితే… హీరోయిన్ ప్రీతి జింటా పెళ్లి రిసెప్షన్ లో తన పెళ్లి ప్రకటన చేసే ఆలోచనలో సల్మాన్ ఉన్నాడట. ఇప్పటికే రొమేనియా దేశానికి చెందిన లులియా అనే మోడల్ తో సన్నిహితంగా ఉంటున్నాడు సల్మాన్ ఖాన్. దాదాపు ముడేళ్లుగా వాళ్లిద్దరి మధ్య డేటింగ్ నడుస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఆమెనే పెళ్లి చేసుకుంటాడని తెలుస్తోంది. ఆ ప్రకటననే ప్రీతి జింటా రిసెప్షన్ లో వెల్లడించాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నాడట. మరోవైపు లులియాకు హిందీ నేర్పించే కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు సల్మాన్. ఆమె కోసం ప్రత్యేకంగా ఓ హిందీ టీజర్ ను కూడా నియమించాడు. ప్రస్తుతం కొంచెంకొంచెం లులియా హిందీ మాట్లాడుతోందట. తన కుటుంబసభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండాలంటే లులియాకు హిందీ రావడం తప్పనిసరి. అందుకే సల్మాన్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. దీనికి తోడు లులియా ఈ మధ్య సల్మాన్ ఇంట్లోనే ఉంటుందట. మొన్నటివరకు సల్మాన్ కు చెందిన ఓ ప్రైవేటు ఫాంహౌజ్ లో ఉన్న లులియా.. ఈమధ్యే సల్మాన్ సొంతింటికి కూడా షిఫ్ట్ అయినట్టు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే… లేటువయసులో సల్మాన్ ఘాటుగా పెళ్లి ప్రకటన చేయడం గ్యారెంటీ అంటున్నారు బాలీవుడ్ జనాలు.
Next Story