Telugu Global
Cinema & Entertainment

ఆలిండియా రికార్డులు బద్దలుకొట్టిన రజనీకాంత్

తన సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే ఆలిండియా రేంజ్ లో రికార్డులు బద్దలుకొట్టాడు రజనీకాంత్. సూపర్ స్టార్ నటించిన కబాలి ఈ సినిమా ఈ సెన్సేషన్ సృష్టించింది. విడుదలైన కొన్నిగంటల్లోనే లక్షల్లో హిట్స్ సంపాదించుకున్న ఈ సినిమా టీజర్… కళ్లముందే అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. తాజాగా ధూమ్-2, సుల్తాన్ సినిమా హిట్స్ ను కూడా కబాలి దాటేసింది. ప్రస్తుతం కబాలి కౌంట్ కోటి 72లక్షల హిట్స్ తో అడ్డులేకుండా దూసుకుపోతోంది. భారత్ లో అత్యధిక హిట్స్ సంపాదించుకున్న […]

ఆలిండియా రికార్డులు బద్దలుకొట్టిన రజనీకాంత్
X
తన సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే ఆలిండియా రేంజ్ లో రికార్డులు బద్దలుకొట్టాడు రజనీకాంత్. సూపర్ స్టార్ నటించిన కబాలి ఈ సినిమా ఈ సెన్సేషన్ సృష్టించింది. విడుదలైన కొన్నిగంటల్లోనే లక్షల్లో హిట్స్ సంపాదించుకున్న ఈ సినిమా టీజర్… కళ్లముందే అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. తాజాగా ధూమ్-2, సుల్తాన్ సినిమా హిట్స్ ను కూడా కబాలి దాటేసింది. ప్రస్తుతం కబాలి కౌంట్ కోటి 72లక్షల హిట్స్ తో అడ్డులేకుండా దూసుకుపోతోంది. భారత్ లో అత్యధిక హిట్స్ సంపాదించుకున్న ఏకైక టీజర్ గా కబాలి నిలిచింది. మలేషియా, చైనా, థాయ్ లాండ్, ఇండోనేషియా, సింగపూర్ జనాలు కూడా కబాలి టీజర్ ను పదేపదే చూడ్డంతో ఈ రికార్డు సాధ్యమైంది. మరోవైపు తెలుగులో కూడా ఇది రికార్డు సృష్టిస్తోంది. తమిళ టీజర్ కంటే 7 గంటల ఆలస్యంగా విడుదలైనప్పటికీ… ఇప్పటివరకు 23లక్షల మంది కబాలి తెలుగు టీజర్ ను వీక్షించారు. ఈ సినిమాను ఆడియోను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈనెల 30న ఉదయం చెన్నైలో, సాయంత్రం హైదరాబాద్ లో కబాలి పాటలు విడుదలవుతాయి. ఇక తెలుగులో ఈ సినిమాను భారీ మొత్తానికి దక్కించుకున్నది ఎవరో కూడా తెలిసిపోయింది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ… కళ్లుచెదిరే రీతిలో 31 కోట్ల మొత్తానికి కబాలి తెలుగు రైట్స్ దక్కించుకుంది.
First Published:  14 May 2016 4:32 AM IST
Next Story