కశ్మీర్ రొమాంటిక్ అందాలకు...ప్రపంచంలో రెండవస్థానం!
లోన్లీ ప్లానెట్ అనే ప్రముఖ ట్రావెల్ మేగజైన్ కశ్మీర్‌ని ప్రపంచంలోనే ద్వితీయ రొమాంటిక్ పర్యాటక ప్రదేశంగా గుర్తించింది. మోస్ట్ రొమాంటిక్ పర్యాటక ప్రాంతంగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఉగ్రవాదుల అలజడి, సరిహద్దు గొడవలు లాంటి వాటితో అక్కడి ప్రశాంతతపై నిరంతరం అనుమానాలున్నా ఇప్పటికీ రోజుకి 4వేలమంది పర్యాటకులు కశ్మీర్‌ని సందర్శిస్తున్నారు. ఇక్కడి గాల్లోనే ఏదో మాయ ఉంది. ఇక్కడికి వచ్చినవారు ఈ రొమాంటిక్ ఫీలింగ్‌ని జీవితాంతం మర్చిపోలేరు…అందుకే మళ్లీ మళ్లీ వస్తుంటారు….కశ్మీర్‌లోయని సందర్శించినవారి మాటలు ఇవి. […]
లోన్లీ ప్లానెట్ అనే ప్రముఖ ట్రావెల్ మేగజైన్ కశ్మీర్‌ని ప్రపంచంలోనే ద్వితీయ రొమాంటిక్ పర్యాటక ప్రదేశంగా గుర్తించింది. మోస్ట్ రొమాంటిక్ పర్యాటక ప్రాంతంగా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఉగ్రవాదుల అలజడి, సరిహద్దు గొడవలు లాంటి వాటితో అక్కడి ప్రశాంతతపై నిరంతరం అనుమానాలున్నా ఇప్పటికీ రోజుకి 4వేలమంది పర్యాటకులు కశ్మీర్‌ని సందర్శిస్తున్నారు. ఇక్కడి గాల్లోనే ఏదో మాయ ఉంది. ఇక్కడికి వచ్చినవారు ఈ రొమాంటిక్ ఫీలింగ్‌ని జీవితాంతం మర్చిపోలేరు…అందుకే మళ్లీ మళ్లీ వస్తుంటారు….కశ్మీర్‌లోయని సందర్శించినవారి మాటలు ఇవి. ఇప్పుడు లోన్లీ ప్లానెట్ ఇచ్చిన హోదాతో కశ్మీర్ సందర్శకులు మరింత పెరుగుతారని, తిరిగి సినిమా షూటింగులు మొదలవుతాయని అక్కడివారు భావిస్తున్నారు. కశ్మీరుకి భూతల స్వర్గం అనే పేరు సైతం ఉంది.