Telugu Global
NEWS

చంద్రబాబును సెంట్రల్ ఇంటెలిజెన్స్ వెంబడించిందా?

ముఖ్యమంత్రులకు కుంటుంబాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో కలిసి గడపాలని ఏ సీఎంకైనా ఉంటుంది. అందుకోసం విహారయాత్రలకు వెళ్లడం కామనే. కానీ ఒకముఖ్యమంత్రి విహారయాత్రలకు వెళ్లాలంటే అందుకు ఒక సమయం సందర్భం ఉంటుంది. రాష్ట్రంలో పరిస్థితులు సవ్యంగా ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రులు ఇలాంటి పర్యటనలకు ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలుసు. అభివృద్ధి ముందుకు సాగడం లేదు. కరువు దెబ్బకు చరిత్ర చూడని స్థాయిలో ప్రాజెక్టులు అడుగంటిపోయాయి. మంచినీరు కూడా దొరకడం […]

చంద్రబాబును సెంట్రల్ ఇంటెలిజెన్స్ వెంబడించిందా?
X

ముఖ్యమంత్రులకు కుంటుంబాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో కలిసి గడపాలని ఏ సీఎంకైనా ఉంటుంది. అందుకోసం విహారయాత్రలకు వెళ్లడం కామనే. కానీ ఒకముఖ్యమంత్రి విహారయాత్రలకు వెళ్లాలంటే అందుకు ఒక సమయం సందర్భం ఉంటుంది. రాష్ట్రంలో పరిస్థితులు సవ్యంగా ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రులు ఇలాంటి పర్యటనలకు ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలుసు. అభివృద్ధి ముందుకు సాగడం లేదు. కరువు దెబ్బకు చరిత్ర చూడని స్థాయిలో ప్రాజెక్టులు అడుగంటిపోయాయి. మంచినీరు కూడా దొరకడం లేదు.

ఇలాంటి పరిస్థితిలో బాధ్యత కలిగిన ఏ సీఎం కూడా రాష్ట్రం వదిలి వెళ్లరు. కానీచంద్రబాబు మాత్రం కుటుంబసభ్యులతో కలిసి ఏకంగా వారం పాటు విహారయాత్రకు వెళ్లారు. ఆయన ఏ దేశంలో తిరుగుతున్నారన్న విషయం కూడా ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అసాధారణ రీతిలో చంద్రబాబు ఇలా విదేశాలకు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీసిందని చెబుతున్నారు. గతంలో సీఎం విదేశాలకు వెళ్లినప్పుడు టీడీపీ నేతలు గానీ, మీడియా గానీ ఎలా వ్యవహరించేది… ఇప్పుడు బాబు టూర్‌ పై వారు ఎలా స్పందిస్తున్నారన్న దానిపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆరా తీసిందని చెప్పుకుంటున్నారు.. గతంలో చంద్రబాబు విదేశాలకు వెళ్తే ఆయన అనుకూల మీడియా ప్రతినిమిషం జనానికి అప్ డేట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆయన అనుకూల మీడియా మాత్రం చంద్రబాబు అసలు విదేశాల్లో విహరిస్తున్నారన్న భావన కూడా జనానికి కలగకుండా జాగ్రత్తపడుతోంది.

పనామా జాబితాలో చంద్రబాబు బంధువు మోటపర్తి శివరామప్రసాద్ పేరు రావడం, చంద్రబాబుపైనా అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తుండడంతో సొంత మనీ వ్యవహారాలను సరిపెట్టుకునేందుకే చంద్రబాబు విదేశాలకు వెళ్లారన్న అనుమానాన్ని కూడా ప్రభుత్వ ఏజెన్సీలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబు విదేశీ పర్యటన ఏమాత్రం సహజమైనది కాదన్న రిపోర్ట్ కేంద్రానికి అందిందని చెబుతున్నారు. ఏపీలో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబు ఇలా ఏకంగా వారం పాటు విహారయాత్రకు వెళ్లడం అసాధారణ పరిణామమేనని… దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉండవచ్చన్న అభిప్రాయానికి కేంద్ర పెద్దలు కూడా వచ్చారని సమాచారం.

Click on Image to Read:

botsa1

vishal

570 cror containor

DS

vijayawada-corporaters

chandrababu-naidu

YSRCP

talasani-srinivas-yadav-nay

chandrababu-cm

babu

tdp-rajyasabha-elections

minister-narayana

tendulkar-anjali

First Published:  14 May 2016 4:20 AM IST
Next Story