ఆ ముగ్గురు మొనగాళ్ళు వీళ్లేనా?
టీడీపీకి మొదటినుంచి మీడియానే బలం. చంద్రబాబు తప్పులుచేసినా, టీడీపీ ప్రభుత్వంలో లోపాలువున్నా తిమ్మిని బమ్మిని చేసి నిజాలకు ముసుగేసి బాబును రక్షించడంలో కొన్ని మీడియా సంస్థల పాత్ర అద్భుతం. ఇలా మీడియా ముసుగులో బాబుకు ఇంతకాలం సేవలు చేసిన హృదయాలు ఇప్పుడు ప్రతిఫలం కోసం తపిస్తున్నాయి. రాజ్యసభలో అడుగుపెట్టేందుకు మూడు మీడియా సంస్థల అధినేతలు పోటీపడుతున్నారు. ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మీడియా అధినేత, అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన […]
టీడీపీకి మొదటినుంచి మీడియానే బలం. చంద్రబాబు తప్పులుచేసినా, టీడీపీ ప్రభుత్వంలో లోపాలువున్నా తిమ్మిని బమ్మిని చేసి నిజాలకు ముసుగేసి బాబును రక్షించడంలో కొన్ని మీడియా సంస్థల పాత్ర అద్భుతం.
ఇలా మీడియా ముసుగులో బాబుకు ఇంతకాలం సేవలు చేసిన హృదయాలు ఇప్పుడు ప్రతిఫలం కోసం తపిస్తున్నాయి. రాజ్యసభలో అడుగుపెట్టేందుకు మూడు మీడియా సంస్థల అధినేతలు పోటీపడుతున్నారు. ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మీడియా అధినేత, అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఛానల్ యజమాని, బాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన మరో ఛానల్ అధినేత కూడా పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశంకోసం ఆరాటపడుతున్నారట.
నిజామాబాద్ జిల్లాకు చెందిన మీడియా అధినేత అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణయే. ఖమ్మం జిల్లాకు చెందిన యజమాని అంటే ఎస్‌టీవి నరేంద్రచౌదరి. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాకు చెందిన టీవి యజమాని అంటే టీవి5 నాయుడుగా భావిస్తున్నారు. ఆంధ్రజ్యోతి తొలినుంచి కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుందన్న భావన బలంగా వుంది. అందుకే ఆయన ఈసారి రాజ్యసభసీటు తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట. మిగిలిన రెండు టీవి ఛానల్స్ యజమానులు కూడా టీడీపీకోసం తమ ఛానళ్లద్వారా చేస్తున్న సేవను వివరించి పెద్దల సభకు పంపాల్సింగా చంద్రబాబుకు ఒత్తిడి తెస్తున్నారట.
చిత్తూరు జిల్లాకు చెందిన టీవి ఛానల్ యజమాని కేంద్రమంత్రిద్వారా లాబీయింగ్ మొదలుపెట్టారని చెబుతున్నారు.ఈ ముగ్గురు కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం మరో విశేషం. చాలామంది నిజామాద్ పత్రిక అధినేతకే అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారని సమాచారం. అయితే ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా మిగిలిన రెండు మీడియా సంస్థలు టీడీపీకి ఎదురుతిరిగే అవకాశం ఉంటుందని టీడీపీనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Click on Image to Read: