రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా
రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈనెల 24 నుంచి 31వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. దేశ వ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 21న 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, జేడీ […]
రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈనెల 24 నుంచి 31వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. దేశ వ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 21న 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, జేడీ శీలం, జైరాం రమేష్ పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో వీహెచ్, గుండు సుధారాణి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఈసారి ఫైట్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుత బలబలాల ప్రకారం ఏపీలో టీడీపీ మూడు, వైసీపీ ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉంది.
Click on Image to Read: