చంద్రబాబుకు అంతలేదట... బీజేపీ నేత ఫైర్
ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాటం చేసినా, బీజేపీతో కయ్యం పెట్టుకున్నా అవినీతి కేసులు, ఓటుకు నోటు కేసును బయటకు తీస్తారన్న భయంతోనే చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని విపక్షాలు పదేపదే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీడియా కొద్ది రోజులుగా కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ఎప్పటికైనా కేంద్రంలో చంద్రబాబు తనకు పోటీదారుగా తయారవుతారన్న భయం మోదీకి పట్టుకుందని అందుకే ఏపీకి ఎలాంటి సాయం చేయడం లేదని పద్దతి ప్రకారం కొన్ని టీవీ చానళ్లు కథనాలు వడ్డిస్తున్నాయి. […]
ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాటం చేసినా, బీజేపీతో కయ్యం పెట్టుకున్నా అవినీతి కేసులు, ఓటుకు నోటు కేసును బయటకు తీస్తారన్న భయంతోనే చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని విపక్షాలు పదేపదే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీడియా కొద్ది రోజులుగా కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ఎప్పటికైనా కేంద్రంలో చంద్రబాబు తనకు పోటీదారుగా తయారవుతారన్న భయం మోదీకి పట్టుకుందని అందుకే ఏపీకి ఎలాంటి సాయం చేయడం లేదని పద్దతి ప్రకారం కొన్ని టీవీ చానళ్లు కథనాలు వడ్డిస్తున్నాయి.
థర్డ్ ఫ్రంట్‌ను ఏకం చేయగలిగిన శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని కాబట్టి ఆయనను బలహీనపరిచే ఎత్తులో భాగంగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోదీ ఇబ్బంది పెడుతున్నారని కథనాలు రాస్తున్నాయి. అంటే మోదీకి చంద్రబాబు భయపడుతున్నారన్న భావనకు విరుగుడుగా ఈ కొత్త ఎత్తు వేశాయి బాబు మీడియా సంస్థలు. ఈ ప్రచారంపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు.
చంద్రబాబును చూసి మోదీ భయపడడం ఏమిటని ఎద్దేవా చేశారు. చంద్రబాబును చూసి మోదీ భయపడుతున్నారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకే మోదీ భయంపట్టుకుందని కౌంటర్ ఇచ్చారు. పోలవరం నిర్మాణం పూర్తయితే మోదీకి మంచి పేరు వస్తుందన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుందని ..అందుకే చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు సాగనివ్వడం లేదన్నారు. లోటు బడ్జెట్ ఉందని చెబుతున్న చంద్రబాబు… ప్రత్యేక విమానాల్లో ఎలా తిరుగుతున్నారని వెల్లంపల్లి గట్టిగా ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే ఆ విషయం బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. అసలు ప్రత్యేక హోదా అన్నది సంజీవిని కాదని చెప్పిందే చంద్రబాబు కదా అని నిలదీశారు. పరిస్థితి చూస్తుంటే టీడీపీ నుంచి దూరమయ్యేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తోంది.
Click on Image to Read: