Telugu Global
NEWS

స్నేక్ గ్యాంగ్‌కు క‌ఠిన శిక్ష విధించిన కోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ అరాచ‌కం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్ష‌లు ఖ‌రారు చేసింది. ఎనిమిది మందిని దోషులుగా తేల్చిన కోర్టు తొలి ఏడుగురు నిందితుల‌కు జీవిత ఖైదు విధించింది. నేర‌స్తుల‌కు స‌హ‌క‌రించినందుకు గాను 8వ నిందితుడికి 20 నెల‌ల జైలు శిక్ష వేసింది. 20 నెల‌ల జైలు శిక్ష ఇప్ప‌టికే పూర్తి కావ‌డంతో 8వ నిందితుడిని విడుద‌ల చేశారు. స్నేక్‌గ్యాంగ్ ఆడ‌గాల‌పై న్యాయ‌మూర్తి తీవ్రంగా స్పందించారు. ఒక మ‌హిళ‌ను నిస్సహాయురాలిని చేసి […]

స్నేక్ గ్యాంగ్‌కు క‌ఠిన శిక్ష విధించిన కోర్టు
X

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ అరాచ‌కం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్ష‌లు ఖ‌రారు చేసింది. ఎనిమిది మందిని దోషులుగా తేల్చిన కోర్టు తొలి ఏడుగురు నిందితుల‌కు జీవిత ఖైదు విధించింది. నేర‌స్తుల‌కు స‌హ‌క‌రించినందుకు గాను 8వ నిందితుడికి 20 నెల‌ల జైలు శిక్ష వేసింది. 20 నెల‌ల జైలు శిక్ష ఇప్ప‌టికే పూర్తి కావ‌డంతో 8వ నిందితుడిని విడుద‌ల చేశారు. స్నేక్‌గ్యాంగ్ ఆడ‌గాల‌పై న్యాయ‌మూర్తి తీవ్రంగా స్పందించారు. ఒక మ‌హిళ‌ను నిస్సహాయురాలిని చేసి దారుణానికి ఒడిగ‌ట్ట‌డం క్ష‌మించ‌రాని నేర‌మ‌న్నారు. తొలుత నేర‌స్తుల‌కు 10ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని భావించారు. కానీ వీరు చేసిన నేరం తీవ్ర‌త బ‌ట్టి జీవిత ఖైదు విధించారు న్యాయ‌మూర్తి. తీర్పుపై మ‌హిళ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

రెండేళ్ల క్రితం ప‌హాడిష‌రీఫ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో స్నేక్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పాముల సాయంతో అమ్మాయిల‌ను భ‌య‌పెట్టి స్నేక్ గ్యాంగ్ ముఠా అత్యాచారాలు చేసింది. దాదాపు 37 మంది అమ్మాయిలు స్నేక్ గ్యాంగ్ అరాచ‌కాల‌కు బ‌లైపోయారు. అయితే అంద‌రూ భ‌యంతో విష‌యం బ‌య‌ట‌కు చెప్పుకోలేక‌పోయారు. యువ‌తుల‌పై అత్యాచారం చేసి వాటిని సెల్ ఫోన్ల‌లో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌చ్చారు.

2014 జులై 31న పెళ్లి కావాల్సిన జంట గెస్ట్ హౌస్ లో ఉండ‌గా స్నేక్ గ్యాంగ్ దాడి చేసింది. కాబోయే భ‌ర్త స‌మ‌క్షంలోనే అమ్మాయిపై ఘాతుకానికి ఒడిగ‌ట్టారు. ఆ స‌మ‌యంలో యువ‌తి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్నేక్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. విచార‌ణ‌లో దిగ్ర్భాంతి క‌లిగించే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. పాముల సాయంతో ఈ మాన‌వ నాగులు 37 మందిపై దారుణానికి ఒడిగ‌ట్టిన‌ట్టు తేలింది. ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయాని(ఎర్రకుంట), ఖాదర్‌ బరాక్బ(ఉస్మాన్‌నగర్‌), తయ్యబ్‌ బసలమ(బండ్లగూడ,బార్కాస్‌), మహ్మద్‌ పర్వెజ్‌(షాయిన్‌నగర్‌), సయ్యద్‌ అన్వర్‌(షాయిన్‌నగర్‌), ఖాజా అహ్మద్‌ (ఉస్మాన్‌నగర్‌), మహ్మద్‌ ఇబ్రాహీం (షాయిన్‌నగర్‌), అలీ బరాక్బ (షాయిన్‌నగర్‌), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. వీరిలో ఏడుగురు నిందితులు చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో విచార‌న ఖైదీలుగా ఉన్నారు. మ‌రో ఇద్ద‌రు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

Click on Image to Read:

pratap-reddy

rami-reddy-pratap-kumar-red

CNN

ttdp

sangeeta-chatterjee

heritage1

venumadhav1

renu-desai

snake-gang

ttdp

vijayawada

There-are-no-widows-in-this

chalasani

First Published:  11 May 2016 8:12 AM IST
Next Story