ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి హీరో ఉదయ్ తరలింపు
ఫేస్‌బుక్ సినిమాలో హీరోగా నటించిన వర్ధమాన నటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించినట్లు మీడియా ఛానళ్లలో కథనాలొస్తున్నాయి. కోర్టు ఆదేశంతో పోలీసులు ఉదయ్‌ని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఉదయ్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు. కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా జడ్జిముందే చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడని చెబుతున్నారు. లాయర్లు అడిగిన ప్రశ్నలకు ఏవేవో సమాధానాలు చెప్పారు. దీంతో అందరు అవాక్కు అయ్యారు. ఉదయ్ పరిస్థితిని […]
ఫేస్‌బుక్ సినిమాలో హీరోగా నటించిన వర్ధమాన నటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించినట్లు మీడియా ఛానళ్లలో కథనాలొస్తున్నాయి. కోర్టు ఆదేశంతో పోలీసులు ఉదయ్‌ని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఉదయ్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు. కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా జడ్జిముందే చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడని చెబుతున్నారు. లాయర్లు అడిగిన ప్రశ్నలకు ఏవేవో సమాధానాలు చెప్పారు. దీంతో అందరు అవాక్కు అయ్యారు. ఉదయ్ పరిస్థితిని గమనించిన జడ్జి అతడిని మెంటల్ ఆసుపత్రికి తరలించాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు కథనం.
చంచల్‌గూడ జైలులోనూ ఉదయ్ ఈవిధంగానే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు జైలు సిబ్బంది వెల్లడించారు. ఫేస్‌బుక్ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ కొద్దిరోజుల క్రితం మత్తులో దసపల్లా హోటల్‌లో హల్‌చల్ చేశాడు. హోటల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అడ్డువచ్చిన హోటల్ సిబ్బందిపైనా దాడి చేశాడు. అద్దాలు పగులగొట్టాడు.
ఉదయ్ గతంలో రవితేజ సోదరుడితో కలిసి డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఉదయ్ ప్రవర్తనపై హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని అరెస్టు చేశారు. అరెస్టయిన సమయంలోనూ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ రెచ్చిపోయాడు. తనను వేధిస్తే లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తాను ఏ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదన్నారు. అమ్మాయిలు తనకు చెల్లెళ్లతో సమానం అన్నాడు. పోలీసులు తన గన్‌మెన్లను కూడా స్టేషన్‌లోకి రానివ్వడం లేదంటూ చెప్పుకొచ్చాడు.
Click on Image to Read: