మూడేళ్లు వెనక్కి వెళ్లిన అల్లరోడు
హిట్ రాకపోతే ఎవరైనా ఏం చేస్తారు… రీమేకులు ప్రయత్నిస్తారు… రీమిక్స్ లు చేస్తారు… లేదంటే తమ పాత సినిమాలకే సీక్వెల్ ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం అల్లరినరేష్ అదే పనిలో ఉన్నాడు. మూడేళ్ల కిందట తనకు హిట్టిచ్చిన సుడిగాడు సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో అల్లరోడు ఉన్నాడు. నిజానికి 2013లో వచ్చిన సుడిగాడు సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు అల్లరి నరేష్. ఎన్నో సినిమాలు… మరెన్నో కాంబినేషన్లు ప్రయత్నించినప్పటికీ రిజల్ట్ మాత్రం సున్నా. […]
BY admin11 May 2016 5:34 AM IST
X
admin Updated On: 11 May 2016 5:34 AM IST
హిట్ రాకపోతే ఎవరైనా ఏం చేస్తారు… రీమేకులు ప్రయత్నిస్తారు… రీమిక్స్ లు చేస్తారు… లేదంటే తమ పాత సినిమాలకే సీక్వెల్ ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం అల్లరినరేష్ అదే పనిలో ఉన్నాడు. మూడేళ్ల కిందట తనకు హిట్టిచ్చిన సుడిగాడు సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో అల్లరోడు ఉన్నాడు. నిజానికి 2013లో వచ్చిన సుడిగాడు సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు అల్లరి నరేష్. ఎన్నో సినిమాలు… మరెన్నో కాంబినేషన్లు ప్రయత్నించినప్పటికీ రిజల్ట్ మాత్రం సున్నా. అందుకే మరోసారి సుడిగాడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయిపోయాడు. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, అల్లరి నరేష్ మధ్య చర్చలు పూర్తయ్యాయి. అయితే సుడిగాడు-2 అనే టైటిల్ పెట్టాలని మాత్రమే ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. ఆ టైటిల్ పై నిజంగానే సుడిగాడు సినిమాకు సీక్వెల్ చేయాలా.. లేక మరో రీమేక్ కథను సుడిగాడు-2 పేరుతో తెరకెక్కించాలా అనే పాయింట్ దగ్గర మాత్రం చర్చలు నిలిచిపోయాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది. సినిమా ఎప్పుడు పక్కా అయినా దాన్ని తనే నిర్మించాలని కూడా అల్లరినరేష్ ఫిక్స్ అయిపోయాడు. మొత్తమ్మీద ఈసారి మనోడు మాంఛి కసిమీదే ఉన్నాడు.
Next Story