బెజవాడలో మళ్లీ మొదలైంది
విజయవాడ. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని. సీఎం అక్కడే ఉంటారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తిరిగే నగరం. ఇలాంటి చోట నిజానికి రౌడీలు వణికిపోవాలి. కానీ బెజవాడలో మాత్రం పట్టపగలే రౌడీల రాజ్యం నడుస్తోంది. రౌడీలు మామూళ్లు వసూళ్లు చేస్తూ పేదల రక్తం తాగుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నడిరోడ్డుపైనే రాడ్లతో దాడులు చేస్తున్నారు. తాజాగా నగరంలోని మొగల్రాజపురం సెంటర్ వద్ద పట్టపగలు నలుగురు వ్యక్తులు ఒక కార్మికుడిపై కర్రలతో దాడి చేసిన ఘటన పరిస్థితి […]

విజయవాడ. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని. సీఎం అక్కడే ఉంటారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తిరిగే నగరం. ఇలాంటి చోట నిజానికి రౌడీలు వణికిపోవాలి. కానీ బెజవాడలో మాత్రం పట్టపగలే రౌడీల రాజ్యం నడుస్తోంది. రౌడీలు మామూళ్లు వసూళ్లు చేస్తూ పేదల రక్తం తాగుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నడిరోడ్డుపైనే రాడ్లతో దాడులు చేస్తున్నారు.
తాజాగా నగరంలోని మొగల్రాజపురం సెంటర్ వద్ద పట్టపగలు నలుగురు వ్యక్తులు ఒక కార్మికుడిపై కర్రలతో దాడి చేసిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి దృశ్యాలనుచూసి అందరూ భయాందోళన చెందుతున్నారు. మొగల్రాజపురం కొండపైన నివాసాలుఉండే వారు ఇళ్ళు కట్టుకోవాలన్నా…ఇళ్ళకు మరమ్మతులు చేసుకోవాలన్నా ఇసుకను కొండదిగువన పోసుకోవడం తప్ప మరో మార్గం ఉండదు. దీన్ని గమనించిన చిల్లర గ్యాంగ్ ఒకటి.. అలా ఇసుక పోసుకున్నందుకు పన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో జనం కూడా రౌడీలకు మామూళ్లు ఇచ్చి జీవనం సాగిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం.. కొండపై నివాసం ఉంటున్న బుల్లబ్బాయి అనే ముఠాకార్మికుడు ఇల్లు కట్టుకునేందుకు కావాల్సిన ఇసుకను కొండ దిగువన డంప్ చేశాడు. వెంటనే చిల్లరగ్యాంగ్‌లోని ఒకడు అక్కడ వాలిపోయి యథావిధిగా డబ్బులు డిమాండ్ చేశాడు. బుల్లబ్బాయి అందుకు నిరాకరించాడు. అంతే ముఠా నాయకుడు సురేష్, మరో ముగ్గురు కలిసి బుల్లబ్బాయిని దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగానే బాధితుడు బతిమలాడుకుంటున్నా వదిలిపెట్టలేదు. నడిరోడ్డుపై కార్మికుడిని ఇష్టానుసారం కొట్టారు.
పట్టపగలు ఒక వ్యక్తిపై కర్రలతో దాడి చేసి పరారయ్యే తరహా అరాచకాలు నగరంలో ఒకప్పుడు జరిగేవని.. మళ్లీ అలాంటి దుర్మార్గాలు ప్రారంభమయ్యాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న దాడి జరగ్గా అదే రోజు బుల్లబ్బాయి సురేష్ ముఠాపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఇప్పటికీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా కుంటిసాకులు చెబుతున్నారు. తాత్కాలిక రాజధానిలోనే శాంతిభద్రతలు ఇంత దారుణంగావుంటే స్టేట్ బ్రాండ్ ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.
click on Image to Read: