నేను ఆవుని...అంటూ ఓ పాఠం!
హిందుత్వ ఎజెండాని నూటికి నూరుపాళ్లు అమలుచేయాలని కంకణం కట్టుకున్న రాజస్థాన్ ప్రభుత్వం, పాఠ్యపుస్తకాల్లోనూ ఆ తరహా మార్పులను తెస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఆవు రాసిన ఉత్తరం… అనే పాఠాన్ని ప్రవేశపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఐదవతరగతి హిందీ పాఠ్య పుస్తకంలో ఈ పాఠం ఉంటుంది. పాఠంతోపాటు ఒక పెద్ద ఆవు చిత్రంలో హిందూ దేవుళ్ల చిత్రాలన్నీ ఉండేలా ఒక బొమ్మ కూడా ఉంటుంది. ఆ ఉత్తరం, ఆవు తాను ఒక తల్లిగా, విద్యార్థులను బిడ్డల్లా […]
హిందుత్వ ఎజెండాని నూటికి నూరుపాళ్లు అమలుచేయాలని కంకణం కట్టుకున్న రాజస్థాన్ ప్రభుత్వం, పాఠ్యపుస్తకాల్లోనూ ఆ తరహా మార్పులను తెస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఆవు రాసిన ఉత్తరం… అనే పాఠాన్ని ప్రవేశపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఐదవతరగతి హిందీ పాఠ్య పుస్తకంలో ఈ పాఠం ఉంటుంది. పాఠంతోపాటు ఒక పెద్ద ఆవు చిత్రంలో హిందూ దేవుళ్ల చిత్రాలన్నీ ఉండేలా ఒక బొమ్మ కూడా ఉంటుంది. ఆ ఉత్తరం, ఆవు తాను ఒక తల్లిగా, విద్యార్థులను బిడ్డల్లా భావిస్తూ రాసినట్టుగా ఉంటుందట. నా కుమారులారా, కుమార్తెలారా…అంటూ మొదలయ్యే ఈ ఉత్తరంలో ఆవు తనని గురించి తాను చెప్పుకుంటుంది.
నేను మీకు బలాన్ని, తెలివితేటలను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంపదను ఇస్తాను…నన్ను తల్లిలా భావించినవారిని నేను నా బిడ్డల్లా ప్రేమిస్తాను….ఇలా సాగుతుంది ఆవు ఉత్తరం పాఠం. ఆవునుండి మనకు అందే ప్రయోజనాలన్నింటినీ ఉత్తరం రూపంలో అందులో వివరించారు. ఆవు వలన మనకు కలిగే ప్రయోజనాలను గురించి పిల్లల్లో అవగాహనని పెంచేందుకు ఇదొక మంచి ముందడుగుగా భావిస్తున్నామని గోపాలన్ (ఆవుల) శాఖా మంత్రి ఓతారాం దేవసి తెలిపారు. అయితే ఈ పాఠాన్ని పిల్లలు చదువుకుంటారు కానీ, ఇందులోంచి ప్రశ్నలు పరీక్షలకు రావు.