రణరంగాన్ని తలపించిన రాజధాని నిర్మాణ ప్రాంతం
ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మితమవుతున్న గుంటూరు జిల్లా వెలగపూడి రణరంగాన్ని తలపించింది. కార్మికులు ఎల్ అండ్ టీ కంపెనీ కార్యాలయంపై దాడులు చేశారు. క్యాంటీన్ ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక అంబులెన్స్‌ను కూడా తగలబెట్టారు. కార్మికుల ఆగ్రహానికి కారణం ఉదయం ఒక కార్మికుడు కాంక్రీట్ మిల్లర్‌లో పడి చనిపోవడమే. కంపెనీ తమతో గొడ్డుచాకిరీ చేయించుకుంటోదని, కానీ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలోనూ ఒక కార్మికుడు […]
ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మితమవుతున్న గుంటూరు జిల్లా వెలగపూడి రణరంగాన్ని తలపించింది. కార్మికులు ఎల్ అండ్ టీ కంపెనీ కార్యాలయంపై దాడులు చేశారు. క్యాంటీన్ ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక అంబులెన్స్‌ను కూడా తగలబెట్టారు. కార్మికుల ఆగ్రహానికి కారణం ఉదయం ఒక కార్మికుడు కాంక్రీట్ మిల్లర్‌లో పడి చనిపోవడమే.
కంపెనీ తమతో గొడ్డుచాకిరీ చేయించుకుంటోదని, కానీ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలోనూ ఒక కార్మికుడు ఇలాగే సచివాలయ నిర్మాణం పనుల్లో పై నుంచి కింద పడి చనిపోయారు. కానీ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. దీంతో కార్మికులు ఆగ్రహించారు.
రాళ్లు, కర్రలతో కార్యాలయం, క్యాంటీన్, వాహనాలపై దాడులు చేశారు. టార్గెట్‌లు పెట్టి పనులు చేయిస్తున్న ఎల్ అండ్ టీ కంపెనీ తమ రక్షణకు కనీస చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కార్మికులు ఒక్కసారిగా ఆందోళన చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో భారీగా పోలీసులు చేరుకుని కార్మికులను చెదరగొట్టారు. ఉన్నతాధికారులు కార్మికులతో చర్చలు జరిపారు. మృతుడి కుటుంబసభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు. పరిస్థితి మరోసారి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
click on Image to Read: