Telugu Global
National

రెండువంద‌ల ఏళ్లుగా అక్ష‌య‌ తృతీయ‌ని జ‌రుపుకోని ఊరు!

దేశ‌మంతా ఈరోజు అక్ష‌య తృతీయని జ‌రుపుకుంటుండ‌గా…ఒక్క ఊరు మాత్రం ఈ పండుగ‌కు దూరంగా ఉంది. ఉత్తర ప్ర‌దేశ్‌లో ఝాన్సీ, ల‌లిత్‌పూర్‌ల‌కు మ‌ధ్య‌లో ఉన్న త‌ల్‌బెహాత్ అనే ఊరు రెండు వంద‌ల ఏళ్లుగా అక్ష‌య తృతీయ‌ని జ‌రుపుకోవ‌టం లేదు. అందుకు కార‌ణంగా వినిపిస్తున్న క‌థ‌నం ప్ర‌కారం… 1802-42 కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మోర్ ప్ర‌హ్లాద్, అక్ష‌య తృతీయ రోజున పూజ‌కు ఆకులు పూలు సేక‌రిస్తున్న కొంత‌మంది యువ‌తుల‌కు అప‌హ‌రించాడు. త‌రువాత ఆ యువ‌తుల‌పై రాజ‌కోట‌లోని పురుషులు […]

రెండువంద‌ల ఏళ్లుగా అక్ష‌య‌ తృతీయ‌ని జ‌రుపుకోని ఊరు!
X

దేశ‌మంతా ఈరోజు అక్ష‌య తృతీయని జ‌రుపుకుంటుండ‌గా…ఒక్క ఊరు మాత్రం ఈ పండుగ‌కు దూరంగా ఉంది. ఉత్తర ప్ర‌దేశ్‌లో ఝాన్సీ, ల‌లిత్‌పూర్‌ల‌కు మ‌ధ్య‌లో ఉన్న త‌ల్‌బెహాత్ అనే ఊరు రెండు వంద‌ల ఏళ్లుగా అక్ష‌య తృతీయ‌ని జ‌రుపుకోవ‌టం లేదు. అందుకు కార‌ణంగా వినిపిస్తున్న క‌థ‌నం ప్ర‌కారం… 1802-42 కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మోర్ ప్ర‌హ్లాద్, అక్ష‌య తృతీయ రోజున పూజ‌కు ఆకులు పూలు సేక‌రిస్తున్న కొంత‌మంది యువ‌తుల‌కు అప‌హ‌రించాడు. త‌రువాత ఆ యువ‌తుల‌పై రాజ‌కోట‌లోని పురుషులు అత్యాచారం చేశారు. ఈ సంఘ‌ట‌న కార‌ణంగానే ఈ ఊళ్లో అక్షయ తృతీయని జ‌రుపుకోవ‌టం లేద‌ని అంటారు. అందుకు బ‌దులుగా ఈ రోజు మ‌గ‌వారు అంద‌రూ కుల‌మ‌తాల‌కు అతీతంగా ఊళ్లో ఉన్న ఆడ‌వారి పాదాల‌కు న‌మ‌స్క‌రిస్తారు. అక్ష‌య తృతీయ జ‌రుపుకోక‌పోయినా అంత‌కుమించిన మంచి ఆచారం ఇక్క‌డ ఆచ‌ర‌ణ‌లో ఉండ‌టం విశేష‌మని దీనిగురించి తెలిసిన‌వారు భావిస్తుంటారు.

First Published:  9 May 2016 7:30 AM IST
Next Story