రాఖీ మేడమ్ జంప్... అయినా గెలుపు హరీశ్‌దే
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష హైడ్రామా మధ్య ముగిసింది. చివరి నిమిషం వరకు జంపింగ్‌లు సాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాఖీ ఆర్య రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉదయం బీజేపీ శిబిరంలో ప్రత్యక్షమైంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఒకరు హరీష్ రావత్ పంచన చేరి కథను రక్తికట్టించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను వెలువరించలేదు. సీల్డ్ కవర్‌లో స్పీకర్ సుప్రీం కోర్టుకు ఫలితాలను పంపారు. బుధవారం కోర్టు అధికారికంగా ఫలితాలను […]
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష హైడ్రామా మధ్య ముగిసింది. చివరి నిమిషం వరకు జంపింగ్‌లు సాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాఖీ ఆర్య రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉదయం బీజేపీ శిబిరంలో ప్రత్యక్షమైంది. ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఒకరు హరీష్ రావత్ పంచన చేరి కథను రక్తికట్టించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను వెలువరించలేదు. సీల్డ్ కవర్‌లో స్పీకర్ సుప్రీం కోర్టుకు ఫలితాలను పంపారు. బుధవారం కోర్టు అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది.
అసెంబ్లీలో ఓటింగ్ జరిగిన తీరును బట్టి హరీష్ రావతే నెగ్గినట్టుగా భావిస్తున్నారు. మొత్తం 70 మంది సభ్యులున్న సభలో 9మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. 61 మంది ఓటింగ్‌లో పాల్గొనగా 27 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ సభ్యులు, ముగ్గురు ఇండిపెండెంట్‌లు, ఒక బీజేపీ ఎమ్మెల్యే… రావత్‌కు అనుకూలంగా ఓటేసినట్టు తెలుస్తోంది. రావత్‌కు మొత్తం 33 ఓట్లు వచ్చాయని భావిస్తున్నారు. బలపరీక్ష ముగిసిన తర్వాత హరీష్ రావత్ కూడా ఇదే విషయం చెప్పారు. బలపరీక్షలో తానే నెగ్గినట్టు ప్రకటించుకున్నారు. బీజేపీ కూడా ఓటమిని అంగీకరించినట్టుగా ఉంది. అదే జరిగి ఉంటే.. సుప్రీం కోర్టు ఫలితాలను ప్రకటించిన తర్వాత హరీష్ రావత్ తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉంది.
click on Image to Read: