పందులకోసం...కుక్కలను చంపేశాడు!
తన పందులను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి 20 కుక్కలకు విషం ఇచ్చి చంపేశాడు. ముంబయిలోని ప్లష్ మిరా రోడ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఒక ఇంటిముందు ఉన్న సిసిటివి ఫుటేజి ఆధారంగా పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లవారు, జంతుసంరక్షణ కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఈ నేరాన్ని చేసినవారిని పట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండుమూడు ఏరియాల్లో కుక్కలు గుంపులుగా చనిపోయాయని, ఇది ఎవరో కావాలని చేశారని కనుగొన్నారు. […]
తన పందులను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి 20 కుక్కలకు విషం ఇచ్చి చంపేశాడు. ముంబయిలోని ప్లష్ మిరా రోడ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఒక ఇంటిముందు ఉన్న సిసిటివి ఫుటేజి ఆధారంగా పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లవారు, జంతుసంరక్షణ కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఈ నేరాన్ని చేసినవారిని పట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండుమూడు ఏరియాల్లో కుక్కలు గుంపులుగా చనిపోయాయని, ఇది ఎవరో కావాలని చేశారని కనుగొన్నారు. ఈ కేసులో పావా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, ప్రయివేటు డిటెక్టివ్ సలీమ్ చరానియా పోలీసులకంటే వేగంగా చురుగ్గా పరిశోధన చేశాడు. శుక్రవారం రాత్రి కుక్కలు చనిపోగా, ఆదివారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇళ్లముందు ఉన్న సిసిటివి ఫుటేజిని పరిశీలించగా ఒక వ్యక్తి కుక్కలకు ఏదో తినిపిస్తున్న దృశ్యం కనిపించింది. ఆదివారం సాయంత్రానికల్లా నిందితుడిని పట్టుకున్న చరానియా అతని చేత నేరాన్ని ఒప్పించాడు. శ్యామ్‌లాల్ బాదల్ (60) అనే పందులను పెంచే వ్యక్తి తానే కుక్కలను చంపినట్టు ఒప్పుకున్నాడు. పందులను పెంచే ఇతను, వాటిని తాను పెంచే ప్రాంగణంలో వదిలినపుడు కుక్కలు వెంబడిస్తున్నాయని, అందుకే ఈ పనిచేశానని అతను ఒప్పుకున్నాడు. అతను చెప్పిన మాటలను రికార్డు చేసిన చరానియా, ఆ సాక్ష్యాన్ని పోలీసులకు అందించాడు. ఇంతకుముందు కూడా శ్యామ్‌లాల్ కుక్కలను చంపినా అది బయటకు రాలేదని చరానియా వెల్లడించాడు.