మనసులో మాట చెప్పిన డీకే అరుణ
డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరుతారంటూ ఇటీవల తరచు ప్రచారం జరుగుతోంది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలను ఆమె ఖండించారు. అంతేకాదు కాంగ్రెస్‌లో తన భవిష్యత్తుకు భారీ ప్రణాళిక వేసుకుంటున్నట్టుగా ఆమె మాటలున్నాయి. చాక్లెట్లు, బిస్కెట్‌లకు లొంగే వ్యక్తిత్వం తమది కాదన్నారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కాంగ్రెస్‌ను వీడబోమన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా నిలుస్తారా అని ప్రశ్నించగా.. సీఎం అభ్యర్థి ఎవర్నది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడి రేసులో […]
డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరుతారంటూ ఇటీవల తరచు ప్రచారం జరుగుతోంది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలను ఆమె ఖండించారు. అంతేకాదు కాంగ్రెస్‌లో తన భవిష్యత్తుకు భారీ ప్రణాళిక వేసుకుంటున్నట్టుగా ఆమె మాటలున్నాయి. చాక్లెట్లు, బిస్కెట్‌లకు లొంగే వ్యక్తిత్వం తమది కాదన్నారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కాంగ్రెస్‌ను వీడబోమన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా నిలుస్తారా అని ప్రశ్నించగా.. సీఎం అభ్యర్థి ఎవర్నది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.
పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా… ప్రస్తుతం పీసీసీ మార్పు ఉండదని అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నందున ఇప్పటికిప్పుడు మార్పులు ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం పీసీసీ మార్పు తప్పనిసరిగా ఉండవచ్చని అన్నారు. అప్పుడు తప్పకుండా పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతానని డీకే అరుణ చెప్పారు. పరోక్షంగా కాంగ్రెస్‌లో పెద్ద పదవినే అరుణ టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతోంది.
తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారిని పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చిన టీఆర్ఎస్ నేతలకు తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని డీకే అరుణ ప్రశ్నించారు. ఒకప్పుడు టీఆర్ఎస్ నేతలను తుమ్మలలాంటి వారు ఏం తిట్టారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఎవరు ఎలాంటి వారైనా సరే టీఆర్ఎస్ చేరితో మంచివాళ్లు అయిపోతారా అని ప్రశ్నించారు డీకే అరుణ.
click on Image to Read: