మేధావితో నిమ్మరసం తాగించిన సీమ సెగ ?
ప్రత్యేక హోదా కోసం అనంతపురంలో మేధావి చలసాని శ్రీనివాస్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష మొదలైన రెండో రోజే ఆయనను ఆస్పత్రికి తరలించారు. తాను ఆరోగ్యంగా ఉన్నా పోలీసులే బలవంతంగా దీక్ష భగ్నం చేయించారని చలసాని చెబుతున్నారు. అయితే మరోవాదన కూడా వినిపిస్తోంది. రాయలసీమవాదుల నుంచి వస్తున్న సెగ వల్లే ముందు జాగ్రత్తగా దీక్షను భగ్నం చేశారని కొందరు చెబుతున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్న ఐదుగురు యువకులు చలసాని […]
ప్రత్యేక హోదా కోసం అనంతపురంలో మేధావి చలసాని శ్రీనివాస్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష మొదలైన రెండో రోజే ఆయనను ఆస్పత్రికి తరలించారు. తాను ఆరోగ్యంగా ఉన్నా పోలీసులే బలవంతంగా దీక్ష భగ్నం చేయించారని చలసాని చెబుతున్నారు. అయితే మరోవాదన కూడా వినిపిస్తోంది. రాయలసీమవాదుల నుంచి వస్తున్న సెగ వల్లే ముందు జాగ్రత్తగా దీక్షను భగ్నం చేశారని కొందరు చెబుతున్నారు.
ఇందుకు బలం చేకూర్చేలా రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్న ఐదుగురు యువకులు చలసాని దీక్ష వద్దకు వచ్చి నిలదీశారు. రాయలసీమకు నీరందేలా శ్రీశైలం కనీస నీటిమట్టానికి సంబంధించిన జీవో 69పై అభిప్రాయం చెప్పాలని నిలదీశారు. జీవో 120పైనా అభిప్రాయం చెప్పాలని నిలదీశారు. అయితే విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చలసాని గానీ, శివాజీగానీ సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది. రాయలసీమ సమస్యలపై నిలదీసిన ప్రతాపరెడ్డి, సీమకృష్ణ అనే యువకులపై చలసాని అనుచరులు కొందరు దాడి చేసినట్టు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న సీఐ గోరంట్ల మాధవ్ అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ప్రతాపరెడ్డి, సీమ కృష్ణపై రెండోసారి కూడా దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు సోషల్ మీడియాలో పెద్దెత్తున పోస్టులు పెట్టారు. దీంతో చలసాని దీక్షపై రాయలసీమ సానుభూతిపరులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. రాయలసీమ గడ్డపై, ప్రతాపరెడ్డి, సీమకృష్ణను కొట్టించిన చలసానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుదామంటూ సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. సీమ సమస్యలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబే చలసాని, శివాజీ చేత నాటకాలు ఆడిస్తున్నారని దుమ్మెత్తిపోశారు.
ఈ దాడిని కొందరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. దాడికి నిరసనగా నంధ్యాలలో రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చలసాని దీక్షపై సోషల్ మీడియాలో ఈ స్థాయి ప్రతిఘటన రావడంతోనే ఎలాంటి అవాచంనీయ సంఘటనలు జరగకుండా చలసాని దీక్షకు ముగింపు పలికారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో వైద్యులు చలసానికి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. చలసానిని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పరామర్శించారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు చలసానిని పరామర్శించారు.
click on Image to Read: