ఆస్పత్రికి రావడం కన్నా చనిపోవడమే మేలు " రేణు ఫైర్
హీరో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ స్వల్ప ప్రమాదానికి గురయ్యాడు. ఇంటి వద్ద ఆడుకుంటూ సైకిల్ మీద నుంచి కిందపడ్డాడు. దీంతో వెంటనే తల్లి రేణుదేశాయ్ పిల్లాడిని పేరున్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారట. దీనిపై రేణుదేశాయ్ ట్వీట్టర్‌లో పైర్ అయ్యారు. డాక్టర్ల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాయపడ్డ అకీరాను తీసుకుని ఆస్పత్రికి వెళ్లానని అయితే అక్కడ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. చాలా […]
హీరో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ స్వల్ప ప్రమాదానికి గురయ్యాడు. ఇంటి వద్ద ఆడుకుంటూ సైకిల్ మీద నుంచి కిందపడ్డాడు. దీంతో వెంటనే తల్లి రేణుదేశాయ్ పిల్లాడిని పేరున్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారట. దీనిపై రేణుదేశాయ్ ట్వీట్టర్‌లో పైర్ అయ్యారు. డాక్టర్ల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గాయపడ్డ అకీరాను తీసుకుని ఆస్పత్రికి వెళ్లానని అయితే అక్కడ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. చాలా సేపు బాధపడుతూనే ఎదురుచూడాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. ట్రిట్ మెంట్ కోసం ఆస్పత్రికి వెళ్లడం కంటే నేరుగా చనిపోవడమే మేలనిపించిందన్నారు. ఆస్పత్రి సిబ్బంది మొత్తం మానవత్వాన్ని చంపేశారని రేణు ఆవేదనతో ట్వీట్ చేశారు. డాక్టర్లల్లో సున్నితత్వం లోపించిందన్నారు. అయితే అకీరా ఎప్పుడు ప్రమాదానికి గురయ్యాడు, దాని తీవ్రత ఎంత అన్నది మాత్రం రేణు ట్వీట్ చేయలేదు. బహుషా చిన్న ప్రమాదమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణేలో ఉంటున్నారు. పుణేలో ఆస్పత్రుల తీరుపై చాలా విమర్శలున్నాయి.
Akira had bad cycle accident,got him to one of d best hospitals&inspite of seeing an injuredchild d delay in treatmnt&waiting&insensitivity
— renu (@renuudesai) May 9, 2016
click on Image to Read: