Telugu Global
NEWS

37 మంది యువతుల రేప్ కేసు... స్నేక్ గ్యాంగ్‌పై రంగారెడ్డి కోర్టు తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ అరాచ‌కం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువ‌రించింది. ఎనిమిది మందిని దోషులుగా తేల్చింది. ఏ9 నిందితుడిపై కేసు కొట్టివేసింది. వీరికి శిక్ష ఎంత అన్న‌ది బుధ‌వారం కోర్టు తేల్చ‌నుంది. రెండేళ్ల క్రితం ప‌హాడిష‌రీఫ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో స్నేక్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పాముల సాయంతో అమ్మాయిల‌ను భ‌య‌పెట్టి స్నేక్ గ్యాంగ్ ముఠా అత్యాచారాలు చేసింది. దాదాపు 37 మంది అమ్మాయిలు స్నేక్ గ్యాంగ్ అరాచ‌కాల‌కు బ‌లైపోయారు. అయితే […]

37 మంది యువతుల రేప్ కేసు... స్నేక్ గ్యాంగ్‌పై రంగారెడ్డి కోర్టు తీర్పు
X

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ అరాచ‌కం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువ‌రించింది. ఎనిమిది మందిని దోషులుగా తేల్చింది. ఏ9 నిందితుడిపై కేసు కొట్టివేసింది. వీరికి శిక్ష ఎంత అన్న‌ది బుధ‌వారం కోర్టు తేల్చ‌నుంది. రెండేళ్ల క్రితం ప‌హాడిష‌రీఫ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో స్నేక్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పాముల సాయంతో అమ్మాయిల‌ను భ‌య‌పెట్టి స్నేక్ గ్యాంగ్ ముఠా అత్యాచారాలు చేసింది. దాదాపు 37 మంది అమ్మాయిలు స్నేక్ గ్యాంగ్ అరాచ‌కాల‌కు బ‌లైపోయారు. అయితే అంద‌రూ భ‌యంతో విష‌యం బ‌య‌ట‌కు చెప్పుకోలేక‌పోయారు. యువ‌తుల‌పై అత్యాచారం చేసి వాటిని సెల్ ఫోన్ల‌లో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌చ్చారు.

2014 జులై 31న పెళ్లి కావాల్సిన జంట గెస్ట్ హౌస్ లో ఉండ‌గా స్నేక్ గ్యాంగ్ దాడి చేసింది. కాబోయే భ‌ర్త స‌మ‌క్షంలోనే అమ్మాయిపై ఘాతుకానికి ఒడిగ‌ట్టారు. ఆ స‌మ‌యంలో యువ‌తి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్నేక్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. విచార‌ణ‌లో దిగ్ర్భాంతి క‌లిగించే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. పాముల సాయంతో ఈ మాన‌వ నాగులు 37 మందిపై దారుణానికి ఒడిగ‌ట్టిన‌ట్టు తేలింది. ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయాని(ఎర్రకుంట), ఖాదర్‌ బరాక్బ(ఉస్మాన్‌నగర్‌), తయ్యబ్‌ బసలమ(బండ్లగూడ,బార్కాస్‌), మహ్మద్‌ పర్వెజ్‌(షాయిన్‌నగర్‌), సయ్యద్‌ అన్వర్‌(షాయిన్‌నగర్‌), ఖాజా అహ్మద్‌ (ఉస్మాన్‌నగర్‌), మహ్మద్‌ ఇబ్రాహీం (షాయిన్‌నగర్‌), అలీ బరాక్బ (షాయిన్‌నగర్‌), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. వీరిలో ఏడుగురు నిందితులు చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో విచార‌న ఖైదీలుగా ఉన్నారు. మ‌రో ఇద్ద‌రు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇంత దారుణానికి ఒడిగ‌ట్టిన వారికి క‌ఠిన శిక్ష విధించాల‌ని మ‌హిళ‌లు కోరుతున్నారు.

click on Image to Read:

amaravathi1

ttdp

vijayawada

vsr3

There-are-no-widows-in-this

renu-desai

chalasani

DK-Aruna

kothapalli-subbarayudu

katamaneni-bhaskar

chandrababu-b

devi-reddy-death

First Published:  9 May 2016 8:57 AM IST
Next Story