Telugu Global
Others

శ్రీ‌కాంతాచారి త‌ల్లికి సిరిసిల్ల  ఎందుకివ్వ‌లేదు: ఉత్త‌మ్‌

పాలేరు ఉప ఎన్నిక కాంగ్రెస్ – గులాబీ పార్టీల మ‌ధ్య మాట‌ల చిచ్చు పెట్టింది. ఇది రోజురోజుకు దావాన‌లంలా మారుతోంది. మీరంటే మీరంటూ.. మాట‌మాట‌, విమ‌ర్శ‌కు ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కేసీఆర్‌పై చేసిన తాజా ఆరోప‌ణ‌లు కొత్త చ‌ర్చ‌కు దారి తీశాయి. శ్రీ‌కాంతాచారి త‌ల్లిపై నేను పోటీ చేయ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. హుజూర్ న‌గ‌ర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న త‌న‌పైనే శ్రీ‌కాంతాచారి త‌ల్లిని పోటీకి దింపార‌ని […]

శ్రీ‌కాంతాచారి త‌ల్లికి సిరిసిల్ల  ఎందుకివ్వ‌లేదు: ఉత్త‌మ్‌
X
పాలేరు ఉప ఎన్నిక కాంగ్రెస్ – గులాబీ పార్టీల మ‌ధ్య మాట‌ల చిచ్చు పెట్టింది. ఇది రోజురోజుకు దావాన‌లంలా మారుతోంది. మీరంటే మీరంటూ.. మాట‌మాట‌, విమ‌ర్శ‌కు ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కేసీఆర్‌పై చేసిన తాజా ఆరోప‌ణ‌లు కొత్త చ‌ర్చ‌కు దారి తీశాయి. శ్రీ‌కాంతాచారి త‌ల్లిపై నేను పోటీ చేయ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. హుజూర్ న‌గ‌ర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న త‌న‌పైనే శ్రీ‌కాంతాచారి త‌ల్లిని పోటీకి దింపార‌ని కేసీఆర్‌పై మండిప‌డ్డారు. గెల‌వ‌ద‌ని తెలిసే త‌న‌ను హుజూర్ న‌గ‌ర్ నుంచి పోటీకి దింపార‌ని ఆరోపించారు. అదే శ్రీ‌కాంతాచారి త‌ల్లి త‌న‌కు సిరిసిల్ల నుంచి పోటీ చేసే అవ‌కాశ‌మివ్వాల‌ని కేసీఆర్‌ను కోరినా.. ఆయ‌న క‌నిక‌రించ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తాడు. మాన‌వ‌త్వంలేనిది మీకా..మాకా ? అంటూ ఎదురుదాడికి దిగారు.
అస‌లేం జ‌రిగింది?
మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష ఒక పోరాటానికి ఊపిరి పోసింది. అదే స‌మ‌యంలో విద్యార్థి లోకం ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా వీధుల్లోకి వ‌చ్చి ఆందోళ‌న‌ల‌కు దిగారు. ఇదే క్ర‌మంలో ఎల్బీన‌గ‌ర్ లో ఆందోళ‌న‌కు దిగిన శ్రీ‌కాంతాచారి అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మార్ప‌ణం చేసుకున్నాడు. తెలంగాణ సాకార‌మే త‌న ల‌క్ష్య‌మంటూ ప్రాణాలు విడిచాడు. శ్రీ కాంతాచారి ప్రాణ‌త్యాగం ఊరికే పోలేదు. మొత్తం తెలంగాణ ప్ర‌జ‌లు వీధుల్లోకి వ‌చ్చి పోరాటాలు చేసేలా స్ఫూర్తి నింపింది. తెలంగాణ క‌ల సాకార‌మ‌య్యాక శ్రీ‌కాంతాచారి చేసిన త్యాగానికి గుర్తుగా వారి కుటుంబంలో ఒక‌రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌న్న డిమాండ్ ఊపందుకుంది. ప్ర‌జా డిమాండ్‌కు త‌లొగ్గిన కేసీఆర్ శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌కు టికెట్ ఇవ్వ‌డానికి అంగీక‌రించారు. అయితే, ఆమె సిరిసిల్ల టికెట్ అడిగితే.. కేసీఆర్ హుజూర్ న‌గ‌ర్ ఇచ్చార‌ని ఉత్త‌మ్ తాజాగా ఆరోపించాడు. దీనిపై గులాబీ నేత‌లు కూడా అదే స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంత‌కుముందే రెండు సార్లు సిరిసిల్ల నుంచి గెలిచి… సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ స్థానం ఎలా ఇస్తారు? అని ఎదురుదాడికి దిగుతున్నారు. పాలేరులో ల‌బ్ధి పొందేందుకే ఉత్త‌మ్ ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.
First Published:  8 May 2016 3:38 AM IST
Next Story