చిక్కుల్లో జోగురామన్న!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ మంత్రీపైనా ఎలాంటి సంచలన ఆరోపణలు రాలేదు. కానీ, మంత్రి జోగు రామన్న ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. సౌమ్యుడిగా పేరొందిన మంత్రి జోగురామన్న ప్రస్తుతం దళితులను అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయనపై ఆదిలాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలు.. ఎస్సీ, ఎస్టీలను అవమానించారనే ఫిర్యాదుతో కోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేశారు. మంత్రి వర్గీయులు మాత్రం ఇది […]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ మంత్రీపైనా ఎలాంటి సంచలన ఆరోపణలు రాలేదు. కానీ, మంత్రి జోగు రామన్న ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. సౌమ్యుడిగా పేరొందిన మంత్రి జోగురామన్న ప్రస్తుతం దళితులను అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయనపై ఆదిలాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలు.. ఎస్సీ, ఎస్టీలను అవమానించారనే ఫిర్యాదుతో కోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేశారు. మంత్రి వర్గీయులు మాత్రం ఇది కేవలం సమాచార లోపం వల్లే జరిగిందని, మంత్రి ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధించలేదని చెబుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ?
ఇటీవల ఆదిలాబాద్ మండలంలో పిప్పల్ ధరి గ్రామంలో సబ్ స్టేషన్ శంకుస్థాపన జరిగింది. ఆ కార్యక్రమానికి దళిత, ఆదివాసి తెగలకు చెందిన సర్పంచ్, ఇతర నేతలను పిలవలేదని, ఇది ఉద్దేశపూర్వకంగా తమకు చేసిన అవమానమేనని.. ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రిపై ఫిర్యాదు కావడంతో పోలీసులు కేసు నమోదుకు వెనకడుగు వేశారు. దీంతో వారు కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం మంత్రితోపాటు, మరో 25 మందిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. వీరిలో ఆదిలాబాద్ ఆర్డీవో, తహసీల్దార్ ఇతర టీఆర్ ఎస్ నేతలు ఉన్నారు. మంత్రిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా రాంజీగోండ్ సేవా సమితి డిమాండ్ చేస్తోంది. కేసు నమోదు చేసినా ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు స్పందించకుంటే.. తాము ఆందోళనలకు దిగుతామని ఆదిలాబాద్ జిల్లా రాంజీగోండ్ సేవా సమితి హెచ్చిరించింది.