Telugu Global
NEWS

సీఎం బంధువంటూ మాట వినని కలెక్టర్!.. ఒక్కటైన దళిత, బీసీ, కాపు టీడీపీ ఎమ్మెల్యేలు

పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టర్ కాటమనేని భాస్కర్ పై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.  చంద్రబాబు తనకు బంధువు అంటూ కాటమనేని భాస్కర్ తమను దారుణంగా ట్రీట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కాటమనేని సంగతి చంద్రబాబు దగ్గరే తేల్చుకునేందుకు జిల్లాలోని ఎస్సీ, బీసీ, కాపు ప్రజాప్రతినిధులు ఒకయ్యారు. కేవలం చింతమనేని నియోజకవర్గానికి మాత్రమే కలెక్టర్ పనిచేస్తున్నారని… మిగిలిన నియోజకవర్గాలను అస్సలు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపణ. చింతమనేని నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు మంత్రులు పీతల సుజాత, […]

సీఎం బంధువంటూ మాట వినని కలెక్టర్!..  ఒక్కటైన దళిత, బీసీ, కాపు టీడీపీ ఎమ్మెల్యేలు
X

పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టర్ కాటమనేని భాస్కర్ పై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. చంద్రబాబు తనకు బంధువు అంటూ కాటమనేని భాస్కర్ తమను దారుణంగా ట్రీట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కాటమనేని సంగతి చంద్రబాబు దగ్గరే తేల్చుకునేందుకు జిల్లాలోని ఎస్సీ, బీసీ, కాపు ప్రజాప్రతినిధులు ఒకయ్యారు. కేవలం చింతమనేని నియోజకవర్గానికి మాత్రమే కలెక్టర్ పనిచేస్తున్నారని… మిగిలిన నియోజకవర్గాలను అస్సలు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపణ.

చింతమనేని నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు మంత్రులు పీతల సుజాత, మాణిక్యాలరావుకు కూడా కలెక్టర్ ఆహ్వానాలు పంపడం లేదని చెబుతున్నారు. కలెక్టర్ కాటమనేని తానో కింగ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యానారయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు కూడా కేవలం చింతమనేని, తణుకు నియోజవకర్గాలకు మాత్రమే కేటాయిస్తున్నారని జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే సీఎం తనకు బంధువంటూ బెదిరిస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ.

ఉద్యోగులకు కాటమనేని చుక్కలు చూపిస్తున్నారట. ఈ నెల జీతాలను రెండు రోజుల పాటు నిలివేసి ఆలస్యంగా అందేలా చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.మంత్రులకు ప్రోట్ కాల్ కూడా జిల్లాలో అమలు కానివ్వడం లేదని టీడీపీనేతల మరో ఆరోపణ. కలెక్టర్ స్థాయి వ్యక్తికి ఉండకూడదని పీలింగ్ కాటమనేనిలో ఉందని అందుకే కొందరికి మాత్రమే వంతపాడుతున్నారని ఎస్సీ, బీసీ, కాపు టీడీపీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. నేతలు, ఉద్యోగుల తరపున కలెక్టర్ పై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి.

click to read-

ysrcp-defections

devi-reddy-death-case

ganta-srinivas-rao

chandrababu-pulivendula

upasana-reaction

defection-mlas

paritala-sriram-new

First Published:  8 May 2016 5:47 AM IST
Next Story