మంత్రి బొజ్జలకు బెదిరింపు కాల్.. మరీ ఇంత చీప్ బేరమా?!
చిత్తూరు జిల్లాకు చెందిన ఏపీ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. మంత్రికి ఫోన్ చేసిన ఒక యువకుడు డబ్బులు డిమాండ్ చేశారు. మీ అవినీతికి సంబంధించిన వివరాలు, ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని డబ్బులు ఇవ్వకుంటే వాటిని మీడియాకు ఇస్తానని బెదరించారు. ఫోన్ కాల్ చూసి తొలుత మంత్రి కంగారు పడ్డారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి అడిగిన మొత్తం చూసి మంత్రే ఆశ్చర్యపోయారట. ఏకంగా మంత్రికే ఫోన్ చేసిన సదరు […]
చిత్తూరు జిల్లాకు చెందిన ఏపీ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. మంత్రికి ఫోన్ చేసిన ఒక యువకుడు డబ్బులు డిమాండ్ చేశారు. మీ అవినీతికి సంబంధించిన వివరాలు, ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని డబ్బులు ఇవ్వకుంటే వాటిని మీడియాకు ఇస్తానని బెదరించారు. ఫోన్ కాల్ చూసి తొలుత మంత్రి కంగారు పడ్డారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి అడిగిన మొత్తం చూసి మంత్రే ఆశ్చర్యపోయారట.
ఏకంగా మంత్రికే ఫోన్ చేసిన సదరు యువకుడు… మంత్రి స్థాయి ఎంతో కూడా తెలుసుకోకుండా చీప్ గా రూ. 30 వేలు అడిగేశాడు. దీంతో తొలుత మంత్రి లైట్ తీసుకున్నారు. కానీ సదరు యువకుడు రోజూ మేసేజ్ లు పెట్టేవాడు. దీంతో సదరు బెదిరింపు కాల్ సంగతి చూడాలని తన కుమారుడికి సూచించారు మంత్రి. దీంతో బొజ్జల తనయుడు తిరిగి కాల్ చేయగా.. సదరు యువకుడు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి అందులో డబ్బు జమ చేయాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ విషయాన్ని మంత్రి పోలీసులకు తెలియజేయగా రంగంలోకి దిగిన వారు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫోన్ చేసిన యువకుడు కడప జిల్లాకు చెందిన జగన్ గా గుర్తించారు. ఇతడు హైదరాబాద్లో సీపెట్ కోర్సు చేస్తున్నాడు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
click to read-