ఇప్పుడు కాదండీ… మోడీయే ముఖాన ఛీ కొడితే అప్పుడు చూద్దాం…!
పిరికివాడి ప్రతాపం ఇంటి ముందరే అన్నట్టుగా తయారైంది ఏపీ అధికార పార్టీ. ప్రత్యేక హోదాపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు తొడలైతే కొడుతున్నారు గానీ సౌండ్ మాత్రం రావడం లేదు. తొలుత ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్ పీ చౌదరి పార్లమెంట్ లో చెప్పగానే రాష్ట్రాంలో మేధావులు, నేతలు అంతా భగ్గుమన్నారు. అధికార పార్టీ మాత్రం తొందరెందుకండి.. హోదా ఇవ్వలేమని చెప్పింది సహాయ మంత్రే కదా!. ఆర్థిక […]
పిరికివాడి ప్రతాపం ఇంటి ముందరే అన్నట్టుగా తయారైంది ఏపీ అధికార పార్టీ. ప్రత్యేక హోదాపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు తొడలైతే కొడుతున్నారు గానీ సౌండ్ మాత్రం రావడం లేదు. తొలుత ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్ పీ చౌదరి పార్లమెంట్ లో చెప్పగానే రాష్ట్రాంలో మేధావులు, నేతలు అంతా భగ్గుమన్నారు. అధికార పార్టీ మాత్రం తొందరెందుకండి.. హోదా ఇవ్వలేమని చెప్పింది సహాయ మంత్రే కదా!. ఆర్థిక మంత్రి చెప్పలేదు, ప్రధాని చెప్పలేదు. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు అన్న ధోరణిలో టీడీపీ ఎంపీలు మాట్లాడారు.
మొన్న ఆర్దిక మంత్రి జైట్లీ కూడా హోదాపై స్పందించారు. అన్నింటి గురించి మాట్లాడి హోదా అన్న పదం మాత్రం ఉచ్చరించలేదు. అంటే హోదా లేదు ఏమీ లేదు అని ఆయన కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. ఆర్థిక మంత్రి ప్రకటన చూసైనా చంద్రబాబు, టీడీపీ నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతారని భావించారు. కానీ అలా జరగలేదు. టీడీపీ గీసిన రెండు గీతలను దాటి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పేసినా బాబుగారు సుతిమెత్తగానే స్పందిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ మంత్రి ఒకరు కొత్త గీత గీశారు. సహాయమంత్రి, ఆర్ధిక మంత్రి స్పందించడం కూడా అయిపోవడంతో ఇప్పుడు మోడీని బేస్ చేసుకుని డెడ్ లైన్ పెట్టారు.
ప్రత్యేక హోదా సాధ్యం కాదని మోదీ చెప్పమనండి అప్పుడు కేంద్రంలో కొనసాగాలా బయటకు రావాలా అన్నది ఆలోచిస్తామని గుంటూరు ప్రభుత్వ గెస్ట్ హౌజ్ లో మంత్రి చెప్పారు. అయినా ప్రత్యేక హోదా ఇవ్వబోమని నేరుగా తానే చెప్పడానికి ప్రధాని మోడీ ఏమైనా పిచ్చోడా?. అలా నేరుగా చెబితే ఏమవుతుందో ఆయనకు తెలియదా?. కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేం అని మోడీ నేరుగా చెప్పడమూ జరగదు… ఈ మూడేళ్లలో కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటకు రావడమూ జరగదు. జనమే పిచ్చి పుల్కాలు.
click to read-