షారుక్ ఖాన్ పై కేసు పెట్టిన స్వీట్ షాపు యాజమాని...!
సినిమా సెలిబ్రిటీస్ కాబట్టి అందున్న సూపర్ స్టార్ డమ్ వున్న హీరో చిత్రం .. సో ఏది చేసినా ఏమి కాదు ..ఎవరు అడగరులే అనుకున్నారు. కట్ చేస్తే ఫ్యాన్ చిత్ర రూపంలో షారుక్ ఖాన్ అలాగే, నిర్మాత, డైరెక్టర్ ల పై ఒక స్వీట్ షాపు యజమాని కేసు పెట్టాడు. ఇంతకు షారుక్ చేసింది ఏమిటి..? ఈ మధ్య షారుక్ లీడ్ రోల్ లో వచ్చిన ఫ్యాన్ చిత్రం లో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసిన […]

సినిమా సెలిబ్రిటీస్ కాబట్టి అందున్న సూపర్ స్టార్ డమ్ వున్న హీరో చిత్రం .. సో ఏది చేసినా ఏమి కాదు ..ఎవరు అడగరులే అనుకున్నారు. కట్ చేస్తే ఫ్యాన్ చిత్ర రూపంలో షారుక్ ఖాన్ అలాగే, నిర్మాత, డైరెక్టర్ ల పై ఒక స్వీట్ షాపు యజమాని కేసు పెట్టాడు. ఇంతకు షారుక్ చేసింది ఏమిటి..?
ఈ మధ్య షారుక్ లీడ్ రోల్ లో వచ్చిన ఫ్యాన్ చిత్రం లో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. అందులో అభిమాని గౌరవ్ పాత్ర లో నటించిన షారఖ్ ..తన ఫేవరేట్ హీరోను చూడటానికి స్వీటు బాక్స్ తో వెళ్తాడు. సినిమాలో ఆ సమయంలో గౌవర్ ను అడ్డుకోవడంతో స్వీట్స్ నేలపాలవుతాయి.విషయం ఏమిటంటే.. ఆ స్వీట్స్ ఢిల్లిలోని ఘంటేవాలా స్వీట్ షాపు నుంచి తెచ్చినట్లు స్వీట్ బాక్సా్ మీద పేరు కనిపిస్తుంది. దీంతో తమ అనుమతి లేకుండా.. తమ షాపు పేరును ఉపయోగిస్తూ.. ఆ షాపు యజమాని సుశాంత్ జైన్ నోటిసులు పంపిచారు. చిత్రం నుంచి తమ షాపు పేరు.. ఆ స్వీట్స్ కింద పడే సన్నివేశం తొలిగించాలని జైన్ డిమాండ్ చేశారు. సో ఏదైనా టేక్ ఇట్ ఈజిగా తీసుకుంటే ఇలా నోటిసుల రూపంలో పలకరింపులు రాక మానవు అంటున్నారు పరిశీలకులు.