ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిడుగులాంటి వార్త
ఏపీ, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకునేందుకు భారీగా నగదుతో పాటు అధికార పక్షం మరో ఆశ కూడా చూపుతోంది. 2019నాటికి రెండు రాష్ట్రాల్లో భారీగా నియోజకవర్గాలు పెరుగుతాయని కాబట్టి తమ పార్టీలోకి వస్తే కొత్త స్థానాల్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తామని చెబుతూ వచ్చారు. చంద్రబాబు అయితే బహిరంగ వేదికల మీదే ఈ విషయం చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలకు కండువా కప్పారు. అయితే ఇప్పుడు ఫిరాయింపుదారులకు పిడుగులాంటి వార్త ఈసీ నుంచి వచ్చింది. 2026 […]
ఏపీ, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకునేందుకు భారీగా నగదుతో పాటు అధికార పక్షం మరో ఆశ కూడా చూపుతోంది. 2019నాటికి రెండు రాష్ట్రాల్లో భారీగా నియోజకవర్గాలు పెరుగుతాయని కాబట్టి తమ పార్టీలోకి వస్తే కొత్త స్థానాల్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తామని చెబుతూ వచ్చారు. చంద్రబాబు అయితే బహిరంగ వేదికల మీదే ఈ విషయం చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలకు కండువా కప్పారు. అయితే ఇప్పుడు ఫిరాయింపుదారులకు పిడుగులాంటి వార్త ఈసీ నుంచి వచ్చింది. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కేంద్ర హోంశాఖ కూడా ఇదే చెప్పిందని వివరించింది. 2026 జనాభా లెక్కలు తేలే వరకూ పునర్విభజన సాధ్యం కాదని తేల్చేసింది.
ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఈసీ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ఈసీ నుంచి వచ్చిన లేఖలను కూడా సదరు పత్రిక ప్రచురించింది. తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు వీలుకల్పించే చట్టం ఏదీ లేనందున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఈసీ వివరించింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణ లోని నిబంధనలే అమలులో ఉంటాయంటూ కేంద్ర హోంశాఖ నుంచి తమకు అందిన లేఖ ప్రతిని కూడా అందించింది.
నియోజకవర్గాలు పెరగకపోతే పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజకీయ జీవితానికి గండం ఉన్నట్టే. లేకుంటే ఆయా నియోజవర్గాల్లో అధికార పార్టీ నుంచి ఏదో గ్రూప్ బయటకు రాకతప్పదు. ఒకవేళ నియోజకవర్గాలను పెంచాలంటే ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగ సవరణ ఒక్కటే మార్గం. అయితే కేంద్రంతో చంద్రబాబు సంబంధాలు రానురాను దిగజారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చిలిపి కోరికను కేంద్రం తీరుస్తుందా అన్నది అనుమానమే.
click to read-